Kanipakam: కరోనా నిబంధనల నడుమ కాణిపాకంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు.. నేడు చిన్న శేష, పెద్ద శేష వాహన సేవలు..

| Edited By: Janardhan Veluru

Sep 14, 2021 | 10:17 AM

Kanipakam-Varasiddhi Vinayaka Swamy:  ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రముఖ హిందూ వినాయక ఆలయం కాణిపాకంలో ఉంది.  ఈ క్షేత్రంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక చవితికి..

Kanipakam: కరోనా నిబంధనల నడుమ కాణిపాకంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు.. నేడు చిన్న శేష, పెద్ద శేష వాహన సేవలు..
Kanipakam
Follow us on

Kanipakam-Varasiddhi Vinayaka Swamy:  ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రముఖ హిందూ వినాయక ఆలయం కాణిపాకంలో ఉంది.  ఈ క్షేత్రంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక చవితికి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 21 రోజులు పాటు నిర్వహిస్తారు.  వినాయక  వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా…స్వామి వారు సోమవారం రాత్రి మూడో రోజు మూషిక వాహనాన్ని అధిరోహించి…భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవానికి విశ్వకర్మ వంశస్థులు ఉభదారులుగా వ్యవహరించారు.

ఉదయం ఉభయదారులచే స్వామివారి…మూల విగ్రహానికి సంప్రదాయబద్ధంగా పంచామృతభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. పుష్పాలంకరణ చేపట్టిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తరపున సోమవారం పట్టు వస్త్రాలు విఘ్నేశ్వరుడికి సమర్పించారు. ఆలయ ఈవో భ్రమరాంబ, అర్చకులు పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చి..ఆలయ ఈవో ఎ.వెంకటేశుకు అందచేశారు. వీటిని స్వామి వారికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు గణపతి స్వామి వారికి చిన్న, పెద్ద శేష వాహన సేవలు జరుగనున్నాయి.

వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలకు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, రాష్ట్రాల నుంచి  భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. స్వామివారిని దర్శించుకుంటారు. ఇక గణేష్ మాల ధరించిన భక్తులు మాల ధారణ విరమించుకుంటారు. ఈ నేపథ్యంలో ఆలయాధికారులు మాల విరమించుకునేందుకు ప్రత్యేక సదుపాయం కల్పించారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఈవో వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, ఆలయానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు.

Aslo Read: Vidura Niti: మనిషిలో ఈ లక్షణాలుంటే నేరుగా నరకానికి పోతారట.. అందుకనే వీటిని వదిలించుకోమంటున్న విదురుడు