
హిందూ మతంలో బుధవారం ఏ పనిలోనైనా అడ్డంకులు రాకుండా చేసే గణేశుడిని పూజించడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గణపతి బప్పాను పూజించడం ద్వారా జీవితంలోని అన్ని అడ్డంకులు, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. అటువంటి విశిష్టమైన బుధవారం ఈ ఏడాది గణపయ్య జన్మ దినోత్సవం వచ్చింది. దీంతో ఈ ఏడాది వినాయక చవితి ఆగష్టు 27వ తేదీ బుధవారం జరుపుకోవడానికి భక్తులు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో గణపతికి దర్భ గడ్డిని సమర్పించడం వలన కలిగే ఫలితాలు శాస్త్రాలలో ప్రస్తావించబడింది. గణేశుడుకి దర్భ అంటే చాలా ఇష్టం. ఎవరైనా భక్తితో గణపతికి దర్భాలతో చేసిన దండను సమర్పిస్తే, అతని కోరికలు త్వరలో నెరవేరుతాయని చెబుతారు.
వినాయక చవితి బుధవారం రోజున 21 లేదా 108 ముడులు కలిగిన దర్భ గడ్డి మాలను సమర్పించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయని విశ్వాసం.
గణేశుడికి దూర్వాను సమర్పించడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
ఇంట్లో ,కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు , శాంతి నెలకొంటాయి.
వ్యాపారం, ఉద్యోగం, చదువులలో విజయం సాధిస్తారు.
మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతికూల శక్తి నశిస్తుంది.
బుధ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. తెలివి, వివేకం , వాక్కుపై నియంత్రణ లభిస్తుంది.
వినాయక చవితి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత.. పూజ చేసే సమయంలో నిర్మలమైన మనస్సుతో గణేశుడి విగ్రహం లేదా చిత్రం ముందు కూర్చోండి. 21 లేదా 108 దర్భలతో ఒక దండను తయారు చేసి గణేశుడికి సమర్పించండి.
“ఓం గణగణపతయే నమః” అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయండి.
ఈ ఏడాది వినాయక చవితి బుధవారం రోజున గణేశుడికి దర్భలతో తయారు చేసిన మాల సమర్పించడం వలన భక్తుడు చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగి పోయి.. అదృష్టం సొంతం అవుతుంది. అంతేకాదు బుధ గ్రహం నుంచి ఉపశమనం లభించి.. సంపద, జ్ఞానం, శ్రేయస్సు అనే ఆశీర్వాదాలు లభిస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.