Ganesh Chaturthi: శివాజీ మహారాజ్ సింహాసనంపై ఠీవిగా లాల్‌బాగ్చా రాజా.. భక్తుల సౌకర్యార్ధం స్పెషల్ బస్సులు, రైళ్లు..

|

Sep 17, 2023 | 9:00 AM

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముంబైలోని పురాతన, ప్రసిద్ధ గణేష్ మండపాల్లో ఒకటి    లాల్‌బాగ్చా రాజా. ఇక్కడ జరిగే గణపతి ఉత్సవాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ మండపంలో కొలువుదీరే గణపయ్యను చూడడానికి వేలాది భక్తులు వస్తారు. ఇప్పటికే లాల్‌బాగ్చా రాజా ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు.

Ganesh Chaturthi: శివాజీ మహారాజ్ సింహాసనంపై ఠీవిగా లాల్‌బాగ్చా రాజా.. భక్తుల సౌకర్యార్ధం స్పెషల్ బస్సులు, రైళ్లు..
Ganesh Chaturthi 2023
Follow us on

హిందూ పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చవితి రోజున శివు, పార్వతిల తనయుడు గణపతి పుట్టిన రోజుని జరుపుకుంటారు. వినాయక చవితి కోసం పిల్లలు, పెద్దలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ జరుపుకునే పండగను వినాయక చతుర్థి అని , గణపతి నవరాత్రులని కూడా అంటారు. ఇంటిలో వినాయకుడిని ప్రతిష్టించి పూజించడమే కాదు.. బహిరంగ ప్రదేశాల్లో మండపాలను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నవరాత్రుల పాటు పూజిస్తారు. వినాయక చవితి రోజున విగ్రహాలను ప్రతిష్టించడంతో మొదలయ్యే ఉత్సవాలు అనంత చతుర్దశి రోజున విగ్రహాన్ని నిమజ్జనం చేయడంతో ముగుస్తాయి.

వినాయకుడిని ఊరేగింపుగా తీసుకువెళ్లి నది లేదా సముద్రంలో నిమజ్జనం చేసిన తరవాత వినాయక చవితి ఉత్సవాలు ముగుస్తాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముంబైలోని పురాతన, ప్రసిద్ధ గణేష్ మండపాల్లో ఒకటి    లాల్‌బాగ్చా రాజా. ఇక్కడ జరిగే గణపతి ఉత్సవాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ మండపంలో కొలువుదీరే గణపయ్యను చూడడానికి వేలాది భక్తులు వస్తారు. ఇప్పటికే లాల్‌బాగ్చా రాజా ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఈ ఏడాది లాల్‌బాగ్చా రాజా విగ్రహం ఛత్రపతి శివాజీ మహారాజ్ సింహాసనం మాదిరిగానే అలంకరించబడిన సింహాసనాన్ని అధిష్టించి భక్తులను అనుగ్రహించనున్నారు.

ఇవి కూడా చదవండి

లాల్‌బాగ్చా రాజా విగ్రహం ఈ ఏడాది 12 అడుగుల పొడవు ఉండనుంది. సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ప్రస్తుతం లాల్‌బాగ్చా రాజా గణేషుడి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి. అయితే ఇప్పటికే భక్తుల సౌకర్యార్ధం రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి ఏర్పాట్లు చేశారు.

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలోని దాదర్ స్టేషన్ నుండి కొంకణ్‌కు “నమో ఎక్స్‌ప్రెస్” పేరుతో వినాయక చవితి కోసం ప్రత్యేక రైలును జెండా ఊపి ప్రారంభించారు.

|| గణపతి బప్పా మోరయా ||

వినాయక చవితి పండుగ కోసం కొంకణ్ ప్రాంతానికి వెళ్లే భక్తుల కోసం మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరు ప్రత్యేక రైళ్లు, 338 బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..