Durva Ashtami 2023: రేపే దుర్వా అష్టమి.. గణపతికి దర్భలతో పూజ సమయం, విధానం, విశిష్టత ఏమిటంటే..

|

Sep 21, 2023 | 2:50 PM

గణపతి అత్యంత దయగల దైవం కేవలం దర్భను భక్తితో సమర్పించినా చాలు సంతోషంగా తన భక్తుల పట్ల అనుగ్రహం కురిపిస్తాడు. కోరిన వరాన్ని ఇస్తాడు. ఎవరైనా సరే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో గణేశుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. గణేష్ ఉత్సవం తర్వాత సరిగ్గా 4 రోజుల తర్వాత వచ్చే దుర్వా అష్టమి నాడు ప్రత్యేకంగా వినాయకుడిని పూజించండి. 

Durva Ashtami 2023: రేపే దుర్వా అష్టమి.. గణపతికి దర్భలతో పూజ సమయం, విధానం, విశిష్టత ఏమిటంటే..
Durvashtami
Follow us on

హిందూ మతంలో ప్రథమ పూజను అందుకునే గణపతిని నవరాత్రులు ప్రారంభమయ్యాయి. గణపయ్య భక్తులు భక్తి శ్రద్దలతో పూజలను చేస్తున్నాడు. ఊరూ వాడా గణపతి మండపాలతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా సంతోషకరమైన వాతావరణం ఉంది. గణపతి అత్యంత దయగల దైవం కేవలం దర్భను భక్తితో సమర్పించినా చాలు సంతోషంగా తన భక్తుల పట్ల అనుగ్రహం కురిపిస్తాడు. కోరిన వరాన్ని ఇస్తాడు. ఎవరైనా సరే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో గణేశుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. గణేష్ ఉత్సవం తర్వాత సరిగ్గా 4 రోజుల తర్వాత వచ్చే దుర్వా అష్టమి నాడు ప్రత్యేకంగా వినాయకుడిని పూజించండి.

సనాతన ధర్మంలో వినాయకుని పూజలో చిన్న చిన్న విషయాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి దూర్వాకు సంబంధించిన ఈ పండుగ కూడా దీనికి ప్రతీక. దూర్వా అష్టమి రోజున శ్రీ గణేశ భగవానుడికి  దర్భను సమర్పించే సంప్రదాయం ఉంది. ఈ రోజున శ్రీ గణేశుడిని పూజించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.

దూర్వా అష్టమి ఎప్పుడు ?

ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష అష్టమి తిథి నాడు దూర్వా అష్టమి జరుపుకుంటారు . ఈ పండుగ సరిగ్గా గణేష్ ఉత్సవాల తర్వాత 4 రోజున వస్తుంది. ఈ సంవత్సరం, శుక్ల పక్ష అష్టమి తిథి 22 సెప్టెంబర్ 2023 న మధ్యాహ్నం 1:35 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 23 న మధ్యాహ్నం 12:17 గంటలకు ముగుస్తుంది .

ఇవి కూడా చదవండి

దూర్వా అష్టమి ఉపవాసం, పూజా విధానం

ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి.

ఆ తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి పూజకు కూర్చోవాలి.

పూజ చేస్తున్నప్పుడు ఉపవాస దీక్ష చేపట్టాలి

ఇంటిలోని పూజగదిలో దేవుళ్ళకు పండ్లు , పూలు , అక్షతలను, ధూపం , దీపాలు సమర్పించండి .
అనంతరం గణేశుడికి దర్భలను సమర్పించి పూజ చేయండి. నువ్వులతో కలిపిన తీపి పదార్ధాలను  సమర్పించండి .

పూజ ముగింపులో ఖచ్చితంగా శివయ్యను పూజించండి.

పురాణ కథలో దూర్వా అష్టమి

సనాతన ధర్మంలో ప్రతి పూజ , ఉపవాసం వెనుక దానికి సంబంధించిన కొన్ని పురాణ కథలు ఉన్నాయి . అదేవిధంగా గణేశుడి పురాణ కథ కూడా దుర్వా అష్టమితో ముడిపడి ఉంది. పురాణాల ప్రకారం ఒకప్పుడు   గణేశుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో రాక్షసులు చనిపోలేదు.. అదే సమయంలో మరణించిన తర్వాత కూడా తిరిగి జీవిస్తూ ఉన్నారు. ఆ యుద్ధాన్ని ముగించడానికి శ్రీ గణేశుడు రాక్షసులను  సజీవంగా మింగడం ప్రారంభించాడు. ఇలా చేసిన తరువాత శ్రీ గణేశుడి శరీరంలో చాలా వేడి పుట్టింది. దీంతో గణపతి కడుపులో మంట, శరీరం వేడి ఎక్కడం ప్రారంభించింది. అప్పుడు దేవతలందరూ పచ్చని దర్భ గడ్డిని చాపగా పరిచి దూర్వా సమర్పించారు. అప్పుడు గణపతి శరీర ఉష్ణోగ్రతను గర్భగడ్డి తగ్గించింది. అప్పుడు బుజ్జి గణపయ్యకు ఉపశమనం లభించింది. అప్పటి నుంచి శ్రీ గణేశుడికి దర్భగడ్డి ప్రియమైనదిగా మారింది. అందుకనే దర్భ గడ్డి లేని గణపతి పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.

దూర్వా అష్టమి రోజున, గణేశుడిని పూర్తి ఆచారాల సాంప్రదాయాలతో పూజించండి. దర్భను సమర్పించండి . అనంతరం గణేష్ గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించి , మీ సమస్యను తొలగించమని మనస్ఫూర్తిగా ప్రార్ధించండి. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్ముతారు.

గణపతి గాయత్రీ మంత్రం

ఔం ఏకదంతాయ విద్ధామహే, వక్రతుండాయ ధీమహి, తన్నో దంతి ప్రచోదయాత్

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)