Ganesh Chaturthi: నరుడి రూపంలో పూజలను అందుకునే గణపతి.. ప్రపంచంలో ఏకైక ఆలయం ఎక్కడంటే..

|

Sep 17, 2023 | 9:33 AM

వినాయక చవితి ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న గణపతి దేవాలయాల్లో జనసందోహం కనిపిస్తుంది. అయితే ఈ ఆలయాలన్నింటిలో గణేశుడి విగ్రహానికి తొండం ఉంటుంది. అయితే భారతదేశంలో వినాయకుడి విగ్రహం మానవ రూపంలో ఉన్న ఆలయం ఉందని మీకు తెలుసా.. మానవ రూపంలో ఉన్న  ఏకైక గణేష్ ఆలయ ప్రత్యేకత గురించి ఈ రోజు తెలుసుకుందాం..   

Ganesh Chaturthi: నరుడి రూపంలో పూజలను అందుకునే గణపతి.. ప్రపంచంలో ఏకైక ఆలయం ఎక్కడంటే..
Adi Vinayaka Temple
Follow us on

వినాయక చవితి వేడుకలను దేశ వ్యాప్తంగా మండపాలు రెడీ అవుతున్నారు. చవితి పండగను రేపు కొందరు జరుపుకోనుండగా.. మరికొందరు ఎల్లుండి జరుపుకోనున్నారు. గణేష్ చతుర్థి పండుగ కోసం రెడీ అవుతూ వినాయకుడి స్వాగతం పలికేందుకు ప్రజలు కూడా సన్నాహాలు ప్రారంభించారు. గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా దేశంలోని వినాయక ఆలయాలతో పాటు మండపాల్లో, పూజ గదిలో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న గణపతి దేవాలయాల్లో జనసందోహం కనిపిస్తుంది. అయితే ఈ ఆలయాలన్నింటిలో గణేశుడి విగ్రహానికి తొండం ఉంటుంది. అయితే భారతదేశంలో వినాయకుడి విగ్రహం మానవ రూపంలో ఉన్న ఆలయం ఉందని మీకు తెలుసా.. మానవ రూపంలో ఉన్న  ఏకైక గణేష్ ఆలయ ప్రత్యేకత గురించి ఈ రోజు తెలుసుకుందాం..

ఆదివినాయక దేవాలయం

ఈ వినాయకుడి ఆలయం తమిళనాడులో ఉంది. ఈ ఆలయంలో స్వామివారి పేరు ఆదివినాయకుడు. ఇక్కడ గణేశుడు మానవ రూపంలో పూజించబడుతున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో ఏకైక విగ్రహం. ఈ ఆలయంలో గణపతి విగ్రహం శరీరం.. మానవ ముఖంతో ఉంటుంది. ఇక్కడ గజ ముఖుడు కాదు.

మానవ ముఖంలో ఎందుకు పూజిస్తారంటే ?

పార్వతి దీవి కోసం ఇంట్లోకి వెళ్ళబోతున్న శివయ్యను గణేశుడు అడ్డుకున్నాడు. దీంతో శివుడి కోపం వచ్చి తన త్రిశూలంతో గణేశుడి తలను తన శరీరం నుండి వేరు చేసి ఆ తలను భస్మం చేశాడు. ఆ తర్వాత పార్వతి దేవి కోరికపై గణేశుడిని బతికించడం కోసం గణేశుడి మొండెంపై ఏనుగు తలను ఉంచి జీవం పోశారు. అప్పటి నుంచి వినాయకుడిని గజానుడి రూపంలో పూజిస్తున్నారు. అయితే ఈ ఆలయంలో మాత్రం గణపతిని ఆది అంటే గణపతి మొదటి రూపాన్ని పూజిస్తారు. కనుక ఈ ఆలయానికి ఆది వినాయకుడుగా ప్రసిద్ధిగాంచాడు.

ఇవి కూడా చదవండి

ఆదివినాయక ఆలయానికి ఎలా చేరుకోవాలంటే

ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ జిల్లాలో కుట్నూర్ నుండి 3 కి.మీ దూరంలో తిల్లతర్పన్ పురి అనే ప్రదేశంలో ఉంది. విమానం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయానికి సమీపాన  తిరుచిరాపల్లి విమానాశ్రయం ఉంది. ఇది సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే సమయంలో ఈ ఆలయానికి రైలులో వెళ్లాలనుకుంటే చెన్నై చేరుకున్న తర్వాత తిరువారూరుకు రైలులో చేరుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)