Lord Ganesha
Vinayaka Chaviti: హిందూమతంలో గణేశుడిని ఆరాధిస్తే.. దుఃఖాలు , కష్టాలను తొలగించి, సంతోషాన్ని, అదృష్టాన్ని కలిగిస్తాడని నమ్మకం. గణపతి ఆరాధనకు, భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి అత్యంత పవిత్రమైనది.. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. వినాయక చవితి రోజున గణేశుడు ప్రసన్నుడవుతాడు.. తన భక్తులకు దీవెనలు ప్రసాదిస్తాడని విశ్వాసం. వినాయకుడి పుట్టిన రోజున ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయాలు, ఢిల్లీ నుంచి గల్లీ వరకూ మండపాలు ఏర్పరచి.. గణపతి విగ్రహాన్ని పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తారు. వివిధ గణపతి విగ్రహాలు వేర్వేరు ఫలితాలను ఇస్తారని మీకు తెలుసా..! వివిధ రకాల గణేశుడి విగ్రహాల ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
- గణపతి చతుర్థి రోజున ఇంటికి గణపతి విగ్రహాన్ని తీసుకురావడానికి ముందు, విగ్రహం విరిగిపోకుండా.. సంపూర్ణంగా ఉండేలా చూసుకోండి. మత విశ్వాసం ప్రకారం.. గణపతి విగ్రహంలో ఎలుక, ఒక దంతం, అంకుశం, మోదక ప్రసాదం ఉండాలి.
- ఇంట్లో కూర్చున్న గణపతిని పూజించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కనుక ఇంట్లో సింహాసనం లేదా ఏదైనా ఆసనంపై కూర్చున్న గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి.
- సనాతన సంప్రదాయంలో ఎడమ వైపు నుంచి కుడి వైపునకు తిరిగి ఉన్న తొండం ఉన్న గణపతి విగ్రహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. గణపతి విగ్రహంలో ఎడమ వైపున తొండం ఉంటే చంద్రుడు ఉంటాడని.. కుడి వైపున తొండం ఉన్న విగ్రహంలో సూర్యుడు ఉంటాడని విశ్వాసం.
- ఎడమ వైపున తొండం ఉన్న వినాయక విగ్రహాన్ని పూజిస్తే, సంపద, వృత్తి, వ్యాపారం, సంతానం , వైవాహిక ఆనందం మొదలైన వాటికి సంబంధించిన అన్ని కోరికలు తీరతాయని మత విశ్వాసం.
- కుడివైపు తొండం ఉన్న గణపతిని సిద్ధివినాయకుడు అంటారు. సాధకుడు ఎవారైనా ఇలాంటి గణపతిని పూజిస్తే శత్రువులపై విజయం సాధిస్తాడని, అతని జీవితానికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం.
- వాస్తు ప్రకారం, గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఎప్పుడూ 3, 5, 7 లేదా 9 సంఖ్యలలో ఉంచకూడదు. బదులుగా, మీకు కావాలంటే, మీరు 2, 4 లేదా 6 వంటి గణపతి విగ్రహాలను సరి సంఖ్యలో ఉంచవచ్చు.
- వాస్తు ప్రకారం, మీ ఇంట్లో గణపతి విగ్రహాన్ని ఉంచేటప్పుడు, దిశపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈశాన్యంలో శుభ్రమైన ప్రదేశంలో గణపతిని ప్రతిష్టించండి.
- గణపతి విగ్రహాన్ని ఇంట్లోంచి బయటికి చూసే విధంగా ఉంచవద్దు.. ఇంటిలోపల చూసే విధంగా ఏర్పాటు చేసుకోండి. ఇలా చేసేటప్పుడు విగ్రహం వెనుక చూపే విధంగా ఏర్పాటు చేసుకోవద్దు.
- గణపతి విగ్రహం లేని ప్రదేశంలో మీరు ఉంటే.. పసుపు గణపతిని తయారు చేసి తయారు చేసి తమలపాకు మీద పెట్టి.. పూజించి శుభ ఫలితాలను పొందవచ్చు.
- వాస్తు శాస్త్రం ప్రకారం, గణపతి విగ్రహం అన్ని రకాల వాస్తు దోషాలను తొలగిస్తుందని భావిస్తారు. వాస్తు ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం ముందు, కుడి వెనుక గణపతి విగ్రహాన్ని ఉంచడం ద్వారా ఇంటికి సంబంధించిన అన్ని రకాల దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాల నిలయంగా మారుతుందని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)