Ganesh Utsav: ఈ గణపతి ఆలయంలో వింత సంప్రదాయం.. ప్రసాదాన్ని గొడుగుల్లో స్వీకరించే భక్తులు.. ఎక్కడంటే..

దేశ వ్యాప్తంగా గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వీధి వీధిలో గణపయ్య కొలువుదీరి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. కొన్ని రకాల సంప్రదాయాలకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా గణపతి ఉత్సవాల్లో చోటు చేసుకునే ఒక విచిత్ర సాంప్రదాయం బయపడింది. దీని గురించి దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆలయ పైకప్పు నుంచి ప్రసాదాన్ని భక్తులవైపు విసిరివేస్తారు. ఆ ప్రసాదాన్ని భక్తులు గొడుగులను తలకిందులుగా పట్టుకుని సేకరిస్తారు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలో జరుగుతుంది.

Ganesh Utsav: ఈ గణపతి ఆలయంలో వింత సంప్రదాయం.. ప్రసాదాన్ని గొడుగుల్లో స్వీకరించే భక్తులు.. ఎక్కడంటే..
Unique Tradition Of Lord Ganapati Temple

Updated on: Sep 03, 2025 | 11:48 AM

దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటున్నారు. గణేష్ కు అంకితం చేయబడిన ఈ వినాయక చవితి పండుగను గణేష్ చతుర్థి నుంచి అనంత చతుర్దశి వరకు జరుపుకుంటారు. ఈ సంవత్సరం చవితి ఉత్సవాలు ఆగస్టు 27న ప్రారంభమయ్యాయి.. సెప్టెంబర్ 6న ముగుస్తాయి. ఈ 10 రోజులు గణపతి భూమిపైకి వచ్చి తన భక్తులను ఆశీర్వదిస్తాడని నమ్మకం. ఈ సమయంలో భక్తులు తమ ఇళ్లలో, మండపాలలో గణపతి బప్పా విగ్రహాన్ని ప్రతిష్టించి భక్తిశ్రద్దలతో పూజిస్తారు.

ఈ ఉత్సవాలకు సంబంధించిన ఒక విచిత్ర సంప్రదాయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని నవ్‌గన్ రాజూరి గ్రామంలో గణపతి ఉత్సవాలలో చోటు చేసుకునే ఒక ప్రత్యేకమైన చిత్రం బయటపడింది. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అఖండ హరినామ వారం చివరి రోజున ఇక్కడ ఒక ప్రత్యేక సంప్రదాయం నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం ప్రకారం.. దేవాలయం పైకప్పు నుంచి ప్రసాదాన్ని భక్తుల మధ్య విసిరివేస్తారు, భక్తులు ఆ ప్రసాదాన్ని తలక్రిందులుగా చేసిన గొడుగులలో సేకరిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ సంప్రదాయం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాల సందర్భంగా అఖండ హరినామ సప్తాహం ఈ ప్రత్యేకమైన రీతిలో ముగుస్తుంది. కింద నిలబడి ఉన్న భక్తులు తమ గొడుగులను తలక్రిందులుగా ఉంచుతారు. పైకప్పు నుంచి పడే మహాప్రసాదం ఆ గొడుగులలో పట్టుకుంటారు. ఇలా చేయడం వలన భారీ సంఖ్యలో భక్తులు ఒకే సమయంలో ప్రసాదాన్ని స్వీకరించడానికి వీలు కలుగుతుంది.

అఖండ హరినామ వారం అంటే ఏమిటి?

గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 1న నవగన్ రాజూరి గ్రామంలో అఖండ హరినామ వారోత్సవం నిర్వహించారు. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి సందర్భంగా అఖండ హరినామ వారోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భజన-కీర్తనలు , సత్ సంగత్ మధ్య ఆలయ పైకప్పు నుంచి భక్తులకు మహాప్రసాదం విసురుతారు. ప్రతి సంవత్సరం భక్తులు గొడుగులతో క్రింద నిలబడి తమ గొడుగులలో సేకరించిన ప్రసాదాన్ని స్వీకరిస్తారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)