Tirumala Temple: తిరుమలలో నేటి నుంచి ఉచిత దర్శనాలు.. అయితే వారికి మాత్రమే అని స్పష్టం చేసిన టీటీడీ..

|

Sep 08, 2021 | 2:08 AM

Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత దర్శనాలు పునఃప్రారంభం అయ్యాయి. నేటి నుంచి స్వామివారి సర్వదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది.

Tirumala Temple: తిరుమలలో నేటి నుంచి ఉచిత దర్శనాలు.. అయితే వారికి మాత్రమే అని స్పష్టం చేసిన టీటీడీ..
Ttd
Follow us on

Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత దర్శనాలు పునఃప్రారంభం అయ్యాయి. నేటి నుంచి స్వామివారి సర్వదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో రోజుకి 2వేల టోకెన్లు చొప్పున జారి చేయనుంది. అయితే, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులుకు మాత్రమే ఈ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ పాలకమండలి ప్రకటించింది. ఆ తరువాత క్రమ క్రమంగా ఇతరర ప్రాంతాల వారికి కూడా జారీ చేయడం జరుగుతుందన్నారు. ఇదిలాఉంటే.. టీటీడీ పరిధిలోని స్వామి వారి ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో అగరబత్తులు తయారుచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తిరుమల ఏడుకొండలకు సూచికగా ‘అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి’ అనే బ్రాండ్ల ను ఈనెల 13వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు అగరబత్తుల ధరలు కూడా నిర్ణయించారు. సాధారణ అగరబత్తులు 100 గ్రా. 60గా, ఫ్లోరా అగరబత్తులు 65 గ్రా. రూ.125గా నిర్ణయించింది టీటీడీ.

ఇదిలాఉంటే.. టీటీడీ భవనాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ఈవో జవహార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు టీటీడీ భవనాల వివరాలను కంప్యూటరీకరించడంతో పాటు వాటి పరరిక్షణకు అవసరమైన మార్గదర్శకాలు తయారు చేయాలని ఆలయ సిబ్బందిని ఆయన ఆదేశించారు. కాగా, మంగళవారం నాడు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అంతర్గత ఆడిట్ సమీక్ష నిర్వహించారు. ఆడిట్ కమాండింగ్ లాంగ్వేజ్, ఆఫ్ సెట్ మానిటరింగ్ సాఫ్ట్‌వేర్‌పై సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రమాదాల నివారణకు ఫైర్ అండ్ సేఫ్టీ ఆడిట్, ఎలక్ట్రికల్ ఆడిట్ ఏడాదికి రెండు సార్లు తప్పనసరిగా చేయాలని అధికారులను ఈవో ఆదేశించారు.

Also read:

Shikhar Dhawan Divorces: విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్ దంపతులు?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్..!

Jr NTR : తారక్ అన్ని కార్లపై 9 నంబర్లే ఉండటానికి గల కారణం తెలుసా..? వీడియో

జయలలిత ఎస్టేట్‌లో, వాచ్‌మాన్‌ హత్య, దోపిడి వ్యవహారంలో మళ్లీ సంచలన విషయాలు.. వీడియో