
మనిషి జీవితంలో ముందుకు సాగాలంటే ప్రతికూల ఆలోచనలు వదిలి సానుకూల ఆలోచనలు చేయాలి. మంది గొప్ప వ్యక్తుల జీవితాలు, ఆలోచనల నుంచి ప్రేరణ పొందవచ్చు. అలాంటి ఆలోచనలు జీవితంలో ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరికీ సహాయపడతాయి. మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలలో మహాత్మా విదురుడు ఒకరు. అతని తెలివితేటలు, జ్ఞానం, కృష్ణ భక్తీ వలన విదురుడిని నేటికీప్రజలు గుర్తుంచుకుంటారు. మహాత్మా విదురుడు చెప్పిన విధానాలను విదుర నీతి అంటారు. మహాత్మా విదురుడు ఎప్పుడూ అసంతృప్తిగా ఉండే వ్యక్తుల గురించి తన నీతి శాస్త్రంలో చెప్పాడు. వీరు ఎప్పుడు సంతోషంగా ఉండరు.. దుఃఖ పడుతూనే జీవితాన్ని గడిపెస్తారని అన్నారు.
అసూయ
విదుర నీతి ప్రకారం ఇతరుల పురోగతిని చూసి అసూయపడే వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ విచారంగా ఉంటాడు. ఈ రకమైన గుణం అంటే అసూయ గుణం వ్యక్తులకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. అసూయతో జీవించే వ్యక్తి అవతలి వ్యక్తిలో ప్రతికూలత ఆలోచనలను కూడా పెంచుతాడు.
ద్వేషించే గుణం
ద్వేషం లేదా అసహ్యం అనేది మిమ్మల్ని లోపలి నుంచి దహించి వేసే భావన . ఇతరుల పట్ల అకారణ ద్వేషం ఉన్న వ్యక్తి చివరికి ప్రతికూలత ను ఒంటరితనాన్ని ఎంచుకుంటాడు. అది తప్ప వీరికి మరేమీ మిగలదు. ఇతరులను ద్వేషించే వ్యక్తి తన దగ్గరి బంధువుల నుంచి కూడా దూరం అవుతాడు.
అసంతృప్తి
జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఉన్నదానితో సంతృప్తి చెందాలి. విదుర నీతి ప్రకారం తనకి ఉన్న దానితో సంతృప్తి చెందని వ్యక్తి ఎల్లప్పుడూ అసంతృప్తిగా ఉంటాడు. అలాంటి వారికి ఆనంద సాధనాలు ఉన్నప్పటికీ వారు ఎప్పుడూ సంతోషంగా ఉండరు.
కోపం- అనుమానం
కోపంగా ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పుడూ దుఃఖం ఉంటుందని మహాత్మా విదురుడు అన్నాడు. అధికంగా కోపం తెచ్చుకునే వ్యక్తి జీవితంలో సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది. సంబంధాలను కూడా పాడు చేస్తుంది. ఇంకా విదుర నీతిలో ప్రతి చిన్న విషయాన్ని అనుమానించి, తన జీవితాన్ని నిత్యం సందేహంతో గడిపే వ్యక్తి జీవితం దుఃఖించదాంతోనే గడిచిపోతుందని చెప్పాడు.
ఇతరులపై ఆధారపడి ఉండటం
కష్టపడి పనిచేయడం ద్వారానే విజయం లభిస్తుంది. కష్టపడి పనిచేయడం మానేసి ఇతరులపై ఆధారపడే వ్యక్తికి సమాజంలో తగినంత గౌరవం లభించదు. అలాంటి వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు