
2026లో ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే రెండు ప్రధాన గ్రహణాలు రాబోతున్నాయి. వీటిలో ఒకటి భారతదేశంలో కనిపిస్తుండగా, మరొకటి కనిపించదు. ముఖ్యంగా హోలి రోజున వచ్చే చంద్రగ్రహణం భక్తుల్లో ఆసక్తిని, ఆందోళనను కలిగిస్తోంది. సూతక కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏ పనులు చేయకూడదు? వంటి జ్యోతిష్య రహస్యాలను ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం.
2026 గ్రహణాల క్యాలెండర్ :
సూర్యగ్రహణం (ఫిబ్రవరి 17, 2026): ఇది ఫాల్గుణ అమావాస్య రోజున సంభవిస్తుంది.
గమనిక: ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి, జ్యోతిష్య నిబంధనల ప్రకారం మన దేశంలో సూతక కాలం ఉండదు. భయపడాల్సిన అవసరం లేదు.
చంద్రగ్రహణం (మార్చి 3, 2026):
సూర్యగ్రహణం జరిగిన 15 రోజులకే ఈ గ్రహణం రాబోతోంది.
గమనిక: ఇది భారతదేశంలో పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి సూతక కాలం వర్తిస్తుంది.
హోలీపై ప్రభావం: ఈ రోజునే హోలికా దహనం ఉండటం వల్ల పూజా సమయాలు పండుగ ఆచారాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
గ్రహణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు:
మంత్ర జపం: గ్రహణ సమయంలో దైవ చింతన చేయడం, మంత్రాలు జపించడం వల్ల ప్రతికూల శక్తి నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు.
ఆహార నియమం: వండిన ఆహారంపై తులసి ఆకులను వేయడం వల్ల గ్రహణ కిరణాల ప్రభావం పడదు.
స్నాన దానాలు: గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేసి, పేదలకు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.
శుభ కార్యాలు: సూతక కాలం ప్రారంభమైనప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు కొత్త పనులు లేదా శుభ కార్యాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ వ్యక్తిగత జాతకంపై ప్రభావం గురించి తెలుసుకోవడానికి నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు.