Indrakeeladri: కోట్ల ఖర్చుతో కట్టిన కట్టడాలు కూల్చివేస్తున్న దుర్గగుడి అధికారులు.. మండిపడుతున్న దుర్గమ్మ భక్తులు

|

Sep 26, 2023 | 8:04 AM

దసరా ఉత్సవాల కోసం దుర్గమ్మ ఆలయం రెడీ అవుతుంది. అయితే కోట్లు ఖర్చు పెట్టి కట్టడం..కూల్చడం. దుర్గ గుడి అధికారుల తీరుపై జనం మండిపడుతున్నారు. ఓవైపు దసరా ఉత్సవాలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు కొండచరియలు కూలి పడుతున్నాయి. వీటి సంగతి చూడకుండా..ఈ అనవసరపు పనులు, ఖర్చులు ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

Indrakeeladri: కోట్ల ఖర్చుతో కట్టిన కట్టడాలు కూల్చివేస్తున్న దుర్గగుడి అధికారులు.. మండిపడుతున్న దుర్గమ్మ భక్తులు
Kanaka Durga Temple
Follow us on

అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువై భక్తులపాలిటి కొంగు బంగారంగా పూజలను అందుకుంటుంది. కృష్ణాతీరంలో వేసిన దుర్గాదేవిని తెలుగు రాష్ట్రాలతో పాటు అమ్మవారి భక్తులు దర్శించుకుంటారు. దసరా ఉత్సవాల కోసం దుర్గమ్మ ఆలయం రెడీ అవుతుంది. అయితే కోట్లు ఖర్చు పెట్టి కట్టడం..కూల్చడం. దుర్గ గుడి అధికారుల తీరుపై జనం మండిపడుతున్నారు. ఓవైపు దసరా ఉత్సవాలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు కొండచరియలు కూలి పడుతున్నాయి. వీటి సంగతి చూడకుండా..ఈ అనవసరపు పనులు, ఖర్చులు ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటారు. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సొమ్ము కూడా రాళ్ల పాలవుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన రాతి కట్టడాలను కూల్చివేయడంలో దుర్గ గుడి అధికారులు బిజీబిజీగా కాలం గడుపుతున్నారు. ఎలాంటి ప్లాన్‌ లేకుండా 2016లో దుర్గ గుడి ఇంజినీరింగ్‌ విభాగం ఈ రాతి కట్టడాలను పెద్దఎత్తున కట్టించింది. ఇప్పుడు వాటిని కూల్చివేయిస్తున్నారు అధికారులు. దుర్గ గుడి మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగానే పెర్గోలను కూల్చివేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ విలువైన రాళ్లతో ఈ పెర్గోలను కట్టించారు అధికారులు. కట్టినప్పటి నుంచి ఈ పెర్గోలు నిరుపయోగంగానే పడి ఉన్నాయని చెబుతున్నారు. వీటి వల్ల ఏ ఉపయోగం లేదని, తాజాగా కూల్చివేత కార్యక్రమం ప్రారంభించారు అధికారులు.

మాస్టర్‌ ప్లాన్‌లో భాగమే ఇదంతా అంటున్నారు వాళ్లు. వీటిని కూల్చడానికి మరో కోటి రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాటిని ఎందుకు కట్టారో, ఇప్పుడు మళ్లీ దుర్గమ్మ నిధులు భారీగా వెచ్చించి మరీ వీటిని ఎందుకు కూలుస్తున్నారో అంటూ భక్తులు మండిపడుతున్నారు. దసరా ఉత్సవాలు దగ్గర పడుతున్న సమయంలో ఏర్పాట్లపై కాకుండా కూల్చివేతలపై అధికారులు దృష్టి పెట్టడం విమర్శలకు తావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఇంద్రకీలాద్రి దిగువన హైదరాబాద్‌ హైవేపై కొండ చరియలు విరిగిపడ్డాయి. వరుసగా రెండు రోజుల పాటు భారీగా కొండచరియలు విరిగిపడడంతో భక్తులతో పాటు ప్రజలు కూడా భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ సంఘటన జరిగి 20 రోజులైనా భద్రతా పనులు ఇంకా పూర్తి కాలేదు. కొండ చరియలు విరిగిపడకుండా భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు, అమ్మవారి కొండ మీద అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దుర్గ గుడి అధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..