Swapna Shastra
Image Credit source: pexels
ప్రతి ఒక్కరూ రాత్రి నిద్రలో కలలు కనడం సర్వసాధారణం.. రకరకాల కలలు వస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని కలలు, శుభాలుగా, మరికొన్ని అశుభాలుఆ పరిగనిగనిస్తారు.. అసలు మనం కనే ప్రతి కల వెనుక ఒక కారణం ఉంటుందని స్వప్న శాస్త్రం పేర్కొంటుంది. ఇంకా చెప్పాలంటే.. కలలో కనిపించే సంఘటనలు, లేదా విషయాలు, వస్తువులు, జంతువులు, పక్షులు ఇలా ఏదైనా సరే నిజ జీవితంలో వేరే అర్ధాన్ని కలిగి ఉంటాయట. స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందట. భవిష్యత్తులో జరిగే సంఘటనలకు రాత్రి మనకు వచ్చే కలలకు మధ్య సంబంధం ఉంటుందని చెబుతున్నారు. జీవితంలో జరిగే సంఘటనల గురించి ముందుగా సూచనలను ఇస్తాయని అంటున్నారు.
- అయితే కొన్ని కలలు సంతోషాన్ని కలిగిస్తే.. మరొకొన్ని కలలు భయపెడతాయి. కొన్ని సార్లు మన చుట్టూ జరిగిన సంఘటనల ప్రభావంతో కలలు వస్తాయి. అయితే కలలో ఈ కొన్ని వస్తువులను, దేవుళ్లను చూస్తే ఆకస్మిక ధన లాభం కలుగుతుందట. ధనవంతులు అవుతారట. స్వప్న శాస్త్రం పేర్కొన్న ఆ మూడు వస్తువులు ఏమిటో చూద్దాం..
- ఎవరి కలలో నైనా చీపురు కనిపిస్తే అది శుభానికి సంకేతమట. చీపురిని లక్ష్మీదేవిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో అదృష్టం కలిసి వస్తుందని.. జీవితంలో సిరి సంపదలకు లోటు ఉండదని చీపురు సంకేతాన్ని ఇస్తుందట. కనుక కలలోనైనా చీపురు కనిపిస్తే అదృష్టం అని స్వప్న శాస్త్రం వివరిస్తుంది.
- కలలో అందాల చందమామ కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం. ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. డబ్బుకు జీవితంలో లోటు ఉందట.
- కలలో వర్షం కురుస్తున్న కనిపిస్తే అది కూడా శుభకానికి సంకేతం. అప్పులు తీర్చి రుణ విముక్తి కాబోతున్నారని అర్ధమట. వ్యాపారంలో పెట్టిని పెట్టుబడులు లాభాలను తీసుకొస్తాయట.
- కలలో లక్ష్మీ దేవి కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలో ధనవంతులు అవుతారట.
- అయితే ఎవరైనా సరే తమకు వచ్చిన కలలు మరెవరితోనూ పంచుకోకూడదు. అవి మీలోనే దాచుకోవాలని.. బయటకు చెప్పకూడదని స్వప్న శాస్త్రం పేర్కొంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు