
Wedding
నిద్రపోతున్నప్పుడు ఒక వ్యక్తి చూసే ప్రతి కలకి కొంత అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. ప్రతి కల ఆ వ్యక్తికి ఏదో ఒక మంచి లేదా చెడు సంకేతాన్ని ఇస్తుంది. కొన్ని కలలు భయపెట్టేవిగా ఉంటే.. మరికొన్ని కలలు సంతోషాన్ని కలిగించేవిగా ఉంటాయి. అయితే కొంతమంది తమ కలలో తన సొంత వివాహాన్ని లేదా వేరొకరి వివాహ ఊరేగింపును చూస్తాడు. ఈ రోజు మనం ఒక వ్యక్తికి వచ్చే వివాహ సంబంధిత కలల గురించి, అలాంటి కలలు దేనిని సూచిస్తాయో ఈ రోజు తెలుసుకుందాం..
ఈ కలలు త్వరలోనే వివాహం జరగనుంది అన్న విషయాన్ని సూచిస్తాయి.
- కలలో ఎవరికైనా వివాహ ఊరేగింపు కనిపిస్తే.. అది చాలా శుభప్రదమని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. ఎవరికైనా అలాంటి కల కనిపిస్తే మీకు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అర్థం. మీ కలలో ఎవరినైనా మీ ప్రేమికుడిగా చూసినట్లయితే.. ఈ కలకు అర్ధం.. మీకు నచ్చిన జీవిత భాగస్వామిని పొందవచ్చని సూచిస్తుంది. మీరు మీ ప్రేమికుడితో ఉన్నట్లు కలలో కనిపిస్తే.. ఈ కల అర్ధం మీరు త్వరలో మీ ప్రేమికుడిని వివాహం చేసుకుంటారని సూచిస్తుంది.
- మరోవైపు ఒక అమ్మాయి తనకు తెలిసిన అబ్బాయి తలపాగా ధరించి ఉన్నట్లు కలలో చూస్తే.. ఆ అబ్బాయి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని అర్థం చేసుకోవాలి. మీరు కలలో తలపాగా ధరించి ఉన్నట్లు చూసినట్లయితే.. మీకు వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. మీరు సమీప భవిష్యత్తులో వివాహం చేసుకోవచ్చని అర్థం చేసుకోవాలి. నిజానికి ఎవరి తలపైనైనా పాగా ఉన్నట్లు కనిపిస్తే ఆ కల చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
- మీకు నచ్చిన మెచ్చిన వ్యక్తి మీ భాగస్వామితో మీకు వివాహం జరుగుతున్నట్లు కలలో కనిపిస్తే ఆ కలకు అర్ధం మీరు త్వరలో మీ భాగస్వామిని వివాహం చేసుకోవచ్చని సూచిస్తుంది.
- ఎవరైనా అమ్మాయి తన కలలో పువ్వు పట్టుకున్న అబ్బాయిని చూస్తే.. త్వరలోనే ఆ అమ్మాయికి ఎక్కడి నుండో పెళ్లి ప్రతిపాదన రావచ్చని అర్థం.
- మీరు ప్రపంచ ప్రఖ్యాత ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్నట్లు కల వస్తే.. ఈ కలకు అర్ధం త్వరలో మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని కలుసుకుంటారని సూచిస్తుంది .
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు