Donkey Race: ఘనంగా శ్రీజంబులా పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్లు.. గాడిదల బలప్రదర్శన పోటీలు

|

Feb 20, 2022 | 8:10 PM

Donkey Race: తమ సంప్రదాయాలను కాపాడుకోవడానికి పల్లె ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. కోళ్ల పందాలు (Cock Fighting),  గుర్రాల పందాలు(Horse Race),..

Donkey Race: ఘనంగా శ్రీజంబులా పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్లు.. గాడిదల బలప్రదర్శన పోటీలు
Donkey Race
Follow us on

Donkey Race: తమ సంప్రదాయాలను కాపాడుకోవడానికి పల్లె ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. కోళ్ల పందాలు(Cock Fighting),  గుర్రాల పందాలు(Horse Race), ఎడ్ల బండలాడుగు పందాలు, పొట్టేళ్ల పైటింగ్ తో పాటు అక్కడక్కడా పందుల పందాలను సంప్రదాయ వాదులు నిర్వహించటం చూశాం.. కానీ కర్నూలు జిల్లాలో వెరైటీగా గాడిదల పందాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యాంగా జిల్లోని పలు మండలాల్లో  పోటీల్లో పాల్గొనడం కోసమే గాడిదలను పెంచిపోషిస్తున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన గాడిదల పందాలు అందర్నీ ఆకర్షించాయి. వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లాలోని నంద్యాలలో వెలసిన శ్రీజంబులా పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్లు సందర్భంగా విచిత్రంగా గాడిదల బలప్రదర్శన పోటీలు నిర్వహించారు ఈ పోటీలో పాల్గొనేందుకు అనేక మంది తరలి వచ్చారు. గాడిదల బలప్రదర్శన పోటీలో వివిధ ప్రాంతాల నుంచి గాడిదలు తరలించారు నిర్వహకులు. గాడిదలను ఇంటి సభ్యులుగా భావించే రజకులు వాటికి రకరకాల సినిమాల పేర్లతో ముద్దుగా పిలుచుకుంటారు. శ్రీజంబుల పరమేశ్వరీ అమ్మవారికి పూజలు చేసి పోటీల్లో పాల్గొంటారు.. రజకులను ప్రోత్సహించడంలో భాగంగానే ప్రతీ ఏటా శ్రీ జంబుల పరమేశ్వరీ అమ్మవారి తిరునాల సందర్భంగా గాడిదల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నామంటున్నారు నిర్వాహకులు. బహుమతిగా భారీగానే నగదుని కూడా ఇస్తారు.

Also Read:

 శ్రీవారి భక్తులు బీ అలెర్ట్.. సర్వదర్శనం కోసం ఎన్ని గంటలు పడుతుందో తెలిస్తే షాక్..