హునుమంతుడి భక్తులకు మంగళవారం, శనివారం ఎంతో ప్రత్యేకమైన రోజులుగా పరిగణిస్తారు. ఈ రెండు రోజుల్లోనూ ఆంజనేయుడిని భక్తులు భక్తిశ్రద్ధలతో ఆరాధించి పూజలు చేస్తారు. మంగళవారం నాడు మహాబలి బజరంగబళిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని అంటుంటారు. ఈ క్రమంలోనే మీరు ఈరోజున కొన్ని పనులు చేస్తే.. ఖచ్చితంగా మీ జీవితంలో కష్టాలన్నీ తొలిగిపోతాయి. మీరు మంగళవారం, శనివారం ఇలా చేయడం ద్వారా హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. తద్వారా మీ కోరికను తీర్చుకోవచ్చు. మీ జీవితంలోని అతి కష్టమైన సమస్యలకు సైతం పరిష్కారం లభిస్తుంది. మరి ఆ పనులు ఏంటో తెలుసుకోండి.
1. రాముడి పేరుతో మీరు హనుమంతుడికి ఏదైనా సమర్పిస్తే.. ఆంజనేయుడు ఖచ్చితంగా ప్రసన్నం అవుతాడు. మీ సమస్యలను తీరుస్తాడు.
2. మీరు మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతుడి దేవాలయానికి వెళ్తే.. రాముడి పేరును జపించండి. ఇలా చేయడం ద్వారా మారుతీ మీకు రాబోయే కష్టాలన్నీ తొలగిస్తాడు.
3. మీ జీవితంలో ఏదైనా తీవ్రమైన సంక్షోభం ఎదురైనా.. లేదా ఏదైనా పని మీ చేతుల్లో దాటిపోయినా.. దాన్ని పూర్తి చేసే బాధ్యతను హనుమంతుడిపై పెట్టండి. దీని కోసం మంగళవారం బజరంగబళి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేయండి. అప్పాలను నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం ద్వారా మీరు కోరుకున్న పుణ్యం మీకు లభిస్తుంది.
4. మంగళవారం, శనివారాల్లో ఉపవాసం ఉండి పేదలకు భోజనం పెట్టండి. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో డబ్బుకు, ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదు.
5. మంగళవారం, శనివారాల్లో హనుమంతునికి శెనగలను నైవేద్యంగా పెట్టండి. అలాగే అదే రోజున సుందరకాండ పారాయణం పఠించండి. ఇలా చేయడం వల్ల ఆంజనేయుడు అనుగ్రహం మీపై ఉంటుంది.
6. మంగళవారం, శనివారాల్లో రామరక్షా స్తోత్రాన్ని పఠించండి. అలాగే హనుమంతుడికి బెల్లం సమర్పించండి. ఇలా చేయడం వల్ల జీవితంలోని సమస్యలన్నీ తీరుతాయి.
7. బజరంగబళికి లవంగాలు, యాలకులు, తమలపాకు అంటే చాలా ఇష్టం. శనివారం నాడు హనుమంతునికి ఈ మూడింటిని నైవేద్యంగా పెడితే శని బాధలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఆవనూనెలో లవంగాలు వేసి హనుమంతుని పూజించడం వల్ల బాధల నుంచి విముక్తి పొందొచ్చు.