దీపావళి.. ఈ పేరులోనే ఉంది వెలుగు. దీపావళి వచ్చిందంటే.. ప్రతి ఇల్లూ వెలిగిపోతూ ఉంటుంది. దీపావళి ఒక్కొక్కరు ఒక్కోలా ఇంటిని అలంకరిస్తారు. కొందరు దీపాలను వెలిగిస్తే.. మరికొందరు విద్యుత్ దీపాలతో నింపేస్తారు. దీపావళికి.. ప్రతి ఒక్కరూ షాపింగ్ చేస్తారు. మార్కెట్లో వచ్చే వివిధ రకాల డెకరేషన్ ఐటెమ్స్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను శుభ్ర పరుచుకుని.. ఇంటికి అవసరమైన అన్ని వస్తువులను కొంటూంటారు. ఈ సారి దీపావళి 2023 నవంబర్ 12వ తేదీన వచ్చింది.
దీపావళికి ముఖ్యమైనది డెకరేషనే. ఈ పండుగ సమయంలో చాలా మంది తమ ఇళ్లను దీపాలతో, విద్యుత్ దీపాలతో కొత్తగా అలంకరిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇంటిని అలంకరిస్తూ ఉంటారు. ఈసారి ఇంటిని ఎలా డెకరేషన్ చేయవచ్చా అని ఆలోచిస్తున్నా.. అయితే మీ కోసం కొన్ని డెకరేషన్ ఐటెమ్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాం. వాటిల్లో మీకు నచ్చింది ఏంటో చూడండి. ఇలా ముందుగానే సెట్ చేసుకుంటే.. అందరి కంటే ముందుగానే మీరు డెకరేషన్ పూర్తి చేయవచ్చు.
లాంతరు దీపాలు:
ఇప్పుడు కొత్త ఫ్యాషన్ గా లాంతరు దీపాలు వచ్చాయి. వీటితో మీ ఇంటి లుక్కే మారిపోతుంది. పూర్వం ఈ లాంతరు దీపాలు ఉండేవి. వాటినే ఇప్పుడు రీ మోడల్ చేస్తూ కొత్త డిజైన్స్ తో.. మంచి ఎట్రాక్టీవ్ కలర్స్ తో ముందుకు తీసుకొచ్చారు. ఈ సారి మీ ఇంటి ముందు కలర్ ఫుల్ లాంతరు దీపాలను ఉంచండి. ఎంత చక్కగా ఉంటుందో మీరు ఊహించ లేరు. అదే విధంగా ఒక్కటే కలర్ కాకుండా డార్క్ కలర్స్ ఉన్న వాటిని తీసుకుంటే సరి కొత్తగా ఉంటుంది.
వాటర్ సెన్సార్ దీపాలు:
సాధారణంగా చలి కాలంలో ఈ పండుగ వస్తుంది కాబట్టి.. ఆ సమయంలో గాలి అనేది ఎక్కువగా వీస్తుంది. ఈ సమయంలో మట్టి దీపాలు వెలిగించినా.. అవి ఆరిపోతూ ఉంటాయి. మళ్లీ వాటిని వెలిగించడం ఇదే పని సరిపోతుంది. కొన్ని వెలుగుతూ ఉంటే.. మరి కొన్ని ఆరి లుక్ అంతగా బాగోదు. అయితే ఈసారి మాత్రం వాటర్ సెన్సార్ దీపాలను తీసుకోండి. వీటిల్లో వాటర్ వేస్తే చాలు.. అవి వెలుగుతూ అందంగా కనిపిస్తాయి. ఒక గోడ అంతటా వీటిని పెడితే బలే అందంగా ఉంటాయి.
రంగోలి విత్ దీపాలు:
మీ ఇంటిని మరింత అందంగా ఎట్రాక్టీవ్ గా ఉండాలంటే రంగోలి విత్ దీపాలు ఉండాల్సిందే. అందమైన రంగోలి మీద దీపాలు పెడితే ఆహా.. సూపర్ గా ఉంటుంది. ఈ రంగోలీని పూలతో లేదా కలర్స్ తో కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద.. అందమైన రంగోలి వేసి.. వాటిపై మట్టి దీపాలు ఉంచితే.. చాలా అందంగా కనిపిస్తుంది.
టోరన్స్:
ఇల్లు అలంకరణ వస్తువుల్లో టోరన్స్ కూడా ఒకటి. వీటిని ప్రధాన ద్వారం లేదా మధ్య ద్వారం, ఎంట్రన్స్ వద్ద ఉంచితే చాలా అందంగా ఉంటాయి. ప్రస్తుతం వివిధ రకాల టోరన్స్ మార్కెట్లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి.