
ఐదు రోజుల దీపావళి పండుగ ధన్ తేరాస్ తో ప్రారంభమవుతుంది. దీనిని ధన్ త్రయోదశి అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని చీకటి పక్షంలోని పదమూడవ రోజు త్రయోదశి తిథిని ధన్ తేరాస్ జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరికి పూజలు చేస్తారు. ఈ రోజున కొత్త వస్తువులను కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ధన్ తేరాస్ నాడు షాపింగ్ చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది.
ఈ ఏడాది ధన త్రయోదశి పండగను అక్టోబర్ 18వ తెదీ శనివారం జరుపుకుంటారు. అయితే ధన్ తేరస్ నాడు కొన్ని వస్తువులు కొనడం నిషేధించబడింది. ముఖ్యంగా ఏడు వస్తువులను కొనకూడదు అని నమ్మకం ఉంది. ఈ వస్తువులను కొనడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లోకి పేదరికం వస్తుంది. కనుక ధన్ తేరస్ నాడు ఏ వస్తువులు కొనకూడదో తెలుసుకుందాం.
ఇనుముతో తయారు చేసిన వస్తువులు: ధన్‌తేరాస్ నాడు లోహం కొనడం సాంప్రదాయంగా ఉన్నప్పటికీ ఈ రోజున ఇనుప వస్తువులను కొనడం అశుభంగా పరిగణించబడుతుంది.నమ్మకం ప్రకారం ఇనుము శని దేవుడికి చిహ్నం. ధన్‌తేరాస్ నాడు ఇనుము కొనడం దురదృష్టాన్ని తెస్తుంది.
ఉక్కుతో తయారు చేసిన వస్తువులు: ధన్‌తేరస్ నాడు స్టీల్ పాత్రలు లేదా ఇతర వస్తువులను కొనవద్దు. కనుక ఈ రోజున స్టీల్ వస్తువులను కొనకుండా ఉండండి.
గాజుతో చేసిన వస్తువులు: గాజును రాహువుకు సంబంధించినదిగా భావిస్తారు. కనుక ధన్ తేరస్ రోజున గాజుతో చేసిన వేటినీ కొనకూడదు. ఎందుకంటే అది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తుంది.
పదునైన వస్తువులు: ధన్‌తేరాస్ నాడు సూదులు, కత్తెరలు, కత్తులు వంటి పదునైన లేదా కోణాలున్న వస్తువులను కొనకూడదు. ఈ రోజున ఇంట్లోకి పదునైన వస్తువులను తీసుకురావడం వల్ల దురదృష్టం, ప్రతికూలత వస్తుందని నమ్ముతారు.
ఖాళీ పాత్ర: ధన్‌తేరస్ నాడు పాత్రలు కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఈ రోజున ఇంట్లోకి ఖాళీ పాత్రలను తీసుకువెళ్ళకుండా జాగ్రత్త వహించండి. ఖాళీ పాత్రలు ఇంట్లో శూన్యతను సూచిస్తాయి.
నల్లటి వస్తువులు: ధన్‌తేరాస్ నాడు నల్లని వస్తువులను కొనకూడదు. నల్లని వస్తువులను అశుభకరమైనవిగా భావిస్తారు. కనుక ధన్‌తేరాస్ నాడు నల్లని వస్తువులు లేదా దుస్తులు కొనవద్దు.
నూనె, నెయ్యి: ధన్‌తేరాస్ నాడు నూనె , నెయ్యి కొనడం అశుభంగా పరిగణించబడుతుంది. మీకు అవి అవసరమైతే ధన్‌తేరాస్‌కు ఒక రోజు ముందు వాటిని కొనుగోలు చేయాలి. ధన్‌తేరాస్ నాడు నూనె, నెయ్యి కొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు