Dhanteras 2025: ఈ రోజు ధన్ తేరస్, బంగారం, వెండి కొనడానికి శుభ సమయం, పూజా విధానం తెలుసుకోండి..

దేశవ్యాప్తంగా ధన్ తెరాస్ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు నుంచి ఐదు రోజుల దీపావళి పండుగ ప్రారంభమవుతుంది. ధన్ తేరాస్ నాడు బంగారం, వెండి, ఇత్తడి పాత్రలు, చీపుర్లు లేదా కొత్త వస్తువులను కొనుగోలు చేయడం చాలా పవిత్రమైనదని నమ్ముతారు. ఈ నేపధ్యంలో ఈ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ఉత్తమం సమయం ఎప్పుడో తెలుసుకోండి..

Dhanteras 2025: ఈ రోజు ధన్ తేరస్, బంగారం, వెండి కొనడానికి శుభ సమయం, పూజా విధానం తెలుసుకోండి..
Dhanteras 2025

Updated on: Oct 18, 2025 | 8:54 AM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ధన్‌తేరాస్ పండుగను జరుపుకుంటున్నారు.  ఈ రోజున బంగారం, వెండి , ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది శ్రేయస్సు , అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.

ధన్ తేరాస్ పవిత్రమైన రోజు షాపింగ్ , పూజలకు చాలా ఫలవంతమైనది. దీపావళి పండుగ ధన త్రయోదశి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజున పూజలు ధన్వంతరి, కుబేరుడు, లక్ష్మీ దేవికి అంకితం చేయబడతాయి. ఈ శుభ సమయంలో బంగారం, వెండి, పాత్రలు లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు , సంపద పదమూడు రెట్లు పెరుగుతుందని నమ్ముతారు. ఈ సంవత్సరం త్రయోదశి తిథి అక్టోబర్ 18 వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఈ రోజున ధంతేరాస్ జరుపుకోవడం శుభప్రదంగా ఉంటుంది. ధంతేరాస్ రోజున షాపింగ్ ,పూజకు అనుకూలమైన సమయం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

షాపింగ్ చేయడానికి శుభ సమయం
ధన్‌తేరాస్ నాడు షాపింగ్ చేయడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక పవిత్రమైన శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ ముహూర్త సమయాల్లో మీరు మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు .

ఇవి కూడా చదవండి

చౌఘడియ ముహూర్తం
శుభ సమయం ( చౌఘాడియా ముహూర్త) ఉదయం 7:49 నుంచి 9:15 వరకు షాపింగ్ చేయడానికి మంచి సమయం .

లాభం-పురోగతి ( చౌఘాడియా ముహూర్తం) మధ్యాహ్నం 01:51 నుంచి 03:18 వరకు.. ఈ ముహూర్తం ముఖ్యంగా డబ్బు, వ్యాపారంలో లాభం, పురోగతికి ఫలవంతమైనది.

ఇతర శుభ షాపింగ్ సమయాలు

అభిజీత్ ముహూర్తం : మధ్యాహ్నం 12:01 నుంచి 12:48 వరకు.
అమృత సమయం : మధ్యాహ్నం 2:57 నుంచి 4:23 వరకు.
బంగారం, వెండి కొనడానికి అత్యంత పవిత్రమైన సమయం
శుభ షాపింగ్ సమయం : అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 12:18 నుంచి మరుసటి రోజు ఉదయం 06:26 వరకు .​​

ధన్తేరస్ పూజకు అనుకూలమైన సమయం , ముహూర్తం

ప్రదోష కాలంలో ధంతేరాస్‌ను పూజించడం ఎల్లప్పుడూ అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది .

ధన్ తేరస్ పూజకు శుభ సమయం: సాయంత్రం 7:16 నుంచి 8:20 వరకు.
ప్రదోషకాలం : సాయంత్రం 5:48 నుంచి రాత్రి 8:20 వరకు.

ధన్ తేరస్ పూజా పద్ధతి

సాయంత్రం పూట స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. ఇంటి ఈశాన్య దిశలో ఒక వేదికను ఏర్పాటు చేయండి. వేదికపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరచండి . ధన్వంతరి, కుబేరుడు , లక్ష్మీదేవి విగ్రహాలు లేదా చిత్రాలను ఉంచండి. అలాగే ఒక వైపు గణేశుడి విగ్రహాన్ని ఉంచండి. దీపాలను వెలిగించండి ( కుబేరుడికి నెయ్యి దీపం, యమ ధర్మ రాజుకు నూనె దీపం). నీరు, పండ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, బియ్యం ధాన్యాలు , స్వీట్లు సిద్ధం చేయండి. ఈరోజు కొనుగోలు చేసిన కొత్త వస్తువులను (బంగారం, వెండి, పాత్రలు) పూజలో చేర్చండి.

ముందుగా గణేశుడిని పూజించండి. తరువాత ధన్వంతరికి పసుపు రంగు తీపి పదార్థాలు, కుంకుమ, పసుపును సమర్పించండి. ధన్వంతరి మంత్రాన్ని జపించండి : “ఓం ధన్వంతరే నమః .” తరువాత, కుబేరుడికి తెల్లటి తీపి పదార్థాలు సమర్పించండి.

కుబేర మంత్రాన్ని జపించండి : “ఓం హ్రీం కుబేరాయే నమః .” చివరగా .. లక్ష్మీ దేవిని పూజించి, “ఓం శ్రీ మహాలక్ష్మియై నమః ” అని జపించండి . ధన్ తేరాస్ నాడు యమ ధర్మ రాజుకు దీపాలను వెలిగించే సంప్రదాయం కూడా ఉంది . ప్రదోష కాలం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద దక్షిణం వైపుగా నూనె దీపం వెలిగించండి. ఈ దీపాన్ని యమ దీపం అని పిలుస్తారు. ఇది కుటుంబాన్ని అకాల మరణ భయం నుండి కాపాడుతుంది.

ధన్‌తేరస్ మతపరమైన ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం ధన్వంతరి ఈ రోజున అమృత భాండంతో సముద్ర మథనం సమయంలో ఉద్భవించాడు. అందుకే దీనికి ధనత్రయోదశి అని పేరు వచ్చింది . ఈ రోజున పాత్రలు లోహం లేదా బంగారం , వెండిని కొనుగోలు చేసే ఎవరైనా ఏడాది పొడవునా సంపద , శ్రేయస్సుతో దీవించబడతారని నమ్ముతారు. ఈ రోజున దీపాలు వెలిగించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ రోజున యమ దీపం వెలిగించడం వల్ల యమ ధర్మ రాజు అనుగ్రహం కలిగి అకాల మరణ భయం తొలగిపోతుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు