Ranganatha Temple: ఆ దేవాలయంలో దేవుడికి నైవేద్యంగా లిక్కర్.. పూజ అనంతరం ఏం చేస్తారంటే..?

|

Apr 05, 2021 | 4:20 PM

భారతదేశం సర్వమత సమ్మేలనం. మన దేశంలో ఉన్న సాంప్రదాయాలు కూడా బహుశా ఏ దేశంలో ఉండవేమో. అందుకే భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు అంటే..

Ranganatha Temple: ఆ దేవాలయంలో దేవుడికి నైవేద్యంగా లిక్కర్.. పూజ అనంతరం ఏం చేస్తారంటే..?
Liquor Served To God
Follow us on

భారతదేశం సర్వమత సమ్మేలనం. మన దేశంలో ఉన్న సాంప్రదాయాలు కూడా బహుశా ఏ దేశంలో ఉండవేమో. అందుకే భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు అంటే ప్రపంచ దేశాలకు కూడా ఆసక్తి. కాగా ఇప్పుడు మీకు ఓ విభిన్న సాంప్రదాయం పాటించే దేవాలయం గురించి చెప్పబోతున్నాం. కర్ణాటక బాగల్​కోటే జిల్లా గులేద్​గుడ్డా కేలవడి గ్రామంలోని ప్రాచీన రంగనాథ గుడిలో మిగతా దేవాలయాల కంటే భిన్నంగా మందు బాటిల్​ను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజా కార్యక్రమాల తర్వాత ఆ మందును తీర్థంగా పంచుతారు.

సంవత్సరానికి ఓసారి వచ్చే జాతర సమయంలో స్వామి వారికి ఇలా మందు నైవేద్యం సమర్పిస్తారు భక్తులు. పూజ అనంతరం ఆ మద్యంలో నీటిని కలపకుండా సేవిస్తే.. ఎలాంటి సమస్యలు రావని భక్తుల విశ్వాసం. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో.. ఈ ఏడాది రంగనాథ స్వామి జాతర నిరాడంబరంగా జరిగింది. ఈ దేవాలయం చారిత్రకమైనదని.. రంగనాథ స్వామి ఎంతో మహిమగల దేవుడని భక్తులు చెబుతున్నారు. ఈ లిక్కర్ తీర్థం తాగితే.. ఎలాంటి సమస్యలు రావని అక్కడికి వచ్చిన భక్తులు చెబుతున్నారు.

అసలు దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి..?

పూర్వం.. రాక్షసులను వధించేందుకు వచ్చిన రంగనాథ స్వామి.. శత్రు మూకను సంహరించాక మందును సేవించారని.. ఆ తర్వాత భక్తుల కోర్కెలను తీర్చారని ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది.  అప్పటినుంచి భక్తులు మందు బాటిల్​ను స్వామివారికి నైవేద్యంగా సమర్పించటం ఆనవాయితీగా వస్తుందని, ఆలయ అర్చకులు, అధికారులు చెబుతున్నారు.

Also Read: తెలంగాణలో లాక్‌డౌన్‌ అంటూ నకిలీ ఉత్తర్వులు.. సోషల్‌ మీడియాలో వైరల్‌.. ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు

చిట్టీల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసిన మహిళ.. రూ.4.5 కోట్లు టోకరా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు