TTD: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమలగిరులు.. స్వామి దర్శనం కోసం తప్పని తిప్పలు..

ఏడుకొండల వాడి దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులకు కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి, రోజుల తరబడి క్యూలైన్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది.

TTD: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమలగిరులు.. స్వామి దర్శనం కోసం తప్పని తిప్పలు..
Tirumala Srivari Temple
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 22, 2022 | 5:56 AM

ఏడుకొండల వాడి దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులకు కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి, రోజుల తరబడి క్యూలైన్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. ఎటుచూసినా భక్తజన సందోహమే కనిపిస్తోంది. ఇసుకేస్తే రాలనంతగా పోటెత్తుతున్నారు భక్తులు. దాంతో, క్యూకాంప్లెక్స్‌లు, కంపార్ట్‌మెంట్లు కిక్కిరిసిపోయాయి. కొండపైనా, కొండ కిందా ఒకటే రద్దీ. శ్రీవారి సర్వదర్వనానికి 24గంటలకు పైగా టైమ్‌ పడుతుందంటే కొండపై పరిస్థితి ఎలాగుందో అర్ధంచేసుకోవచ్చు.

సాధారణ భక్తులే కాదు వీఐపీల రాక కూడా ఎక్కువగా ఉందిప్పుడు. దాంతో, తిరుమలలో గదులకు తీవ్ర కొరత ఏర్పడింది. వీఐపీలకు కూడా రూమ్స్‌ దొరకని పరిస్థితి నెలకొంది. సామాన్య భక్తుల కష్టాలైతే వర్ణణాతీతంగా ఉన్నాయ్‌. రూమ్స్‌ దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్‌ సైతం భక్తులతో కిక్కిరిసిపోతోంది. గదుల కోసం నానా తిప్పలు పడుతున్నారు. కొందరికి గదులు దొరికినా రూమ్స్‌ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన మెసేజ్‌లు రాకపోవడంతో బయటే పడిగాపులు పడుతున్నారు.

చలికి వణుకుతూ చీకట్లో మగ్గిపోతున్నారు. సాధారణ గదులన్నీ ఫుల్‌ అవ్వడంతో సత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయ్‌. ఇక, పార్కింగ్‌ ప్లేస్‌లు సైతం వాహనాలతో నిండిపోయాయి. తిరుమల, తిరుపతి, అలిపిరి… ఎక్కడ చూసినా వాహనాల రద్దీనే కనిపిస్తోంది. మరోవైపు శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి అవస్థలు పడుతున్నారు భక్తులు. సహనం నశించి బారికేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకొస్తున్నారు. దాంతో, భక్తులను కంట్రోల్‌ చేయలేక అష్టకష్టాలు పడుతున్నారు పోలీసులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..