Dwaraka Tirumala: చిన వెంకన్నకు ఓ భక్తుడు భారీ విరాళం.. బంగారు ఊయల, పాదుకలు కానుక

|

Feb 27, 2022 | 2:46 PM

Dwaraka Tirumala: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District)లోని శేషాద్రి కొండపై కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల. ఇక్కడ  శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri venkateswara Swami)..

Dwaraka Tirumala: చిన వెంకన్నకు ఓ భక్తుడు భారీ విరాళం.. బంగారు ఊయల, పాదుకలు కానుక
Dwaraka Tirumala
Follow us on

Dwaraka Tirumala: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District)లోని శేషాద్రి కొండపై కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల. ఇక్కడ  శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri venkateswara Swami) భక్తులతో కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలను అందుకుంటున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం. స్వయంభువుగా వెలసిన వేంకటేశ్వర స్వామిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. తాజాగా చిన్న వెంకన్న స్వామికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని చిన్నవెంకన్నస్వామికి ఓ భక్తుడు బంగారు ఊయలను కానుకగా ఇచ్చారు. కళ్లు మిరుమిట్లు తొలిపే దగదగలతో పసుపు వర్ణంలో ఆ బంగారు తూగుటుయ్యాల మెరిసిపోయింది. ఉయ్యాలపై బంగారు నెమళ్లతో చెక్కబడి అత్యంత రమణీయంగా కనువిందు చేసింది.

హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన పర్వతనేని పాండురంగారావు అనే భక్తుడు 17 లక్షల రూపాయల వ్యయంతో బంగారు పూతతో చేయబడిన ఊయలతో పాటు బంగారు పాదుకలను వెంకన్నకి సమర్పించుకున్నారు. ముందుగా వాటిని ఆలయ జంట గోపురాల వద్దనుండి అనివెట్టి మండపం మీదుగా తూర్పు రాజ గోపురం నుండి ప్రదానాలయంలోకి తీసుకువచ్చారు. అక్కడ ఆలయం చుట్టూ ప్రదక్షిణ జరిపి బంగారు ఊయలను, పాదుకలను స్వామివారికి సమర్పించారు. అనంతరం దాత పాండురంగారావు స్వామి అమ్మవార్లను దర్శించుకున్ని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. “పెద్దతిరుపతి”లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును “చిన్నతిరుపతి”లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం.

Also Read:

ఇంట్లో ఆర్థిక సంక్షోభం కలగకూడదంటే.. డబ్బుకు సంబంధించిన ఈ 5 విషయాలను ఎప్పటికీ మర్చిపోకండి