Rudranath Temple: పాండవుల పాపానికి విముక్తి నిచ్చిన క్షేత్రం రుద్రనాథ్.. ఈ నెల 18 న తెరుచుకోనున్న తలుపులు..

ఉత్తరాఖండ్ లో పంచ్ కేదార్ యాత్ర అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటి. కేదార్‌నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్ ఈ ఐదు ఆలయాలు పంచ కేథార్ యాత్ర స్థలాలు. వీటిల్లో ఒక ఆలయం రుద్రనాథ్ ఆలయం.. ఈ ఆలయం తలుపులు మే 18న భక్తుల కోసం తెరవబడతాయి. పంచ కేదార్లలో రుద్రనాథ్ ఆలయం ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత, పాండవులు ఈ ప్రదేశాన్ని సందర్శించారని.. కౌరవులను చంపిన పాపం నుంచి పాండవులు ఇక్కడే విముక్తి పొందారని చెబుతారు.

Rudranath Temple: పాండవుల పాపానికి విముక్తి నిచ్చిన క్షేత్రం రుద్రనాథ్.. ఈ నెల 18 న తెరుచుకోనున్న తలుపులు..
Chamoli Shri Rudranath Temple

Updated on: May 17, 2025 | 11:24 AM

ఉత్తరాఖండ్ కొండలలో ఉన్న రుద్రనాథ్ ఆలయం.. పంచ కేదార్లలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. కేదార్‌నాథ్ ధామ్ శివ భక్తులకు ప్రధాన విశ్వాస కేంద్రంగా ఉన్నట్లే.. రుద్రనాథ్ ఆలయం కూడా శివ భక్తుల్లో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు ఈ ప్రదేశానికి వచ్చి తమ సొంత సోదరులైన కౌరవులను చంపిన పాపం నుంచి విముక్తి పొందారని చెబుతారు. మే 18న భక్తుల కోసం ఆలయ తలుపులు తెరవనున్నారు. ఈ ఆలయ సందర్శనకు రోజుకు కేవలం 140 మంది యాత్రికులు మాత్రమే అనుమతి ఇస్తారు.

రుద్రనాథ్ ఆలయం
శివుడికి అంకితం చేయబడిన ఈ అద్భుత రుద్రనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 3,600 మీటర్లు (11,800 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ సహజ రాతి ఆలయం రోడోడెండ్రాన్ మరుగుజ్జులు, ఆల్పైన్ పచ్చిక బయళ్ల దట్టమైన అడవిలో ఉంది. ఈ ఆలయం పంచ కేదార్లలో నాల్గవ కేదార్‌గా పరిగణించబడుతుంది.

పాండవులతో అనుబంధం కలిగిన ఆలయం
ఈ ఆలయానికి సంబంధించిన పురాణం ప్రకారం ఉన్న నమ్మకం ఏమిటంటే.. ఈ ఆలయాన్ని మహాభారత కాలంలో పాండవులు నిర్మించారు. తన సోదరులైన కౌరవులను చంపిన పాపం నుంచి విముక్తి పొందడానికి పాండవులు ఈ శివాలయాన్ని నిర్మించి ఈ ఆలయంలో శివుడిని పూజించారని చెబుతారు. రుద్రనాథ్ ప్రధాన ఆలయంలో శివుని విగ్రహంతో పాటు, ఆలయం వెలుపల ఎడమ వైపున ఐదుగురు పాండవులు యుధిష్ఠిర, భీముడు, అర్జునుడు, నకులుడు ,సహదేవుడు, పాండవుల తల్లులైన కుంతి, ద్రౌపదిల విగ్రహాలతో పాటు అటవీ దేవతలు, వన దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఆలయానికి కుడి వైపున యక్ష దేవత ఆలయం ఉంది. వీరిని స్థానిక ప్రజలు జఖ్ దేవత అని పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

శివుని ముఖ పూజ
ఈ ఆలయంలో శివుని ముఖాన్ని పూజిస్తారు. ఈ ఆలయంలో ఎద్దు రూపంలో శివుని ముఖం కనిపించిందని నమ్ముతారు. ఈ ఆలయానికి సమీపంలో ఐదుగురు పాండవులతో పాటు కుంతి, ద్రౌపదికి అంకితం చేయబడిన ఇతర చిన్న ఆలయాలు ఉన్నాయి.

పంచ కేదార్ యాత్ర ప్రాముఖ్యత
పంచ కేదార్లలో మొదటి కేదార్ కేదార్నాథ్ అని నమ్ముతారు. ఇక్కడ పాండవులు మొదట శివుని శరీరాన్ని చూశారు. మధ్య మహేశ్వరుడిని రెండవ కేదార్ అని పిలుస్తారు.. ఇక్కడ శివుని మధ్య భాగం కనిపిస్తుంది. మూడవ కేదార్ తుంగనాథ్ శివుని చేయి రూపాన్ని కలిగి ఉంది. నాల్గవ కేదార్ రుద్రనాథ్‌లో శివుని ముఖం కనిపిస్తుంది. ఐదవ కేదార్ కల్పేశ్వర్‌లో శివుని జడ జుట్టు ఉంటుంది. ఈ పంచ కేదార్లలో మూడు కేదార్‌నాథ్, మధ్యమహేశ్వర్, తుంగనాథ్ ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉండగా.. మిగిలిన రెండు రుద్రనాథ్, కల్పేశ్వర్ చమోలి జిల్లాలో ఉన్నాయి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు