
నవరాత్రి సందర్భంగా భారతదేశంలోని అనేక ప్రదేశాలలో దాండియా నైట్స్ నిర్వహిస్తారు. సాంప్రదాయ నృత్యం గర్భను వివిధ రకాల పాటలతో డ్యాన్స్ చేస్తూ పండుగ సంబరాలను అంబరం తాకేలా చేస్తారు. మీరు కూడా ఈసారి నవరాత్రులలో దాండియాను ఆనందించాలనుకుంటున్నారా.. ఈ ప్రదేశాలను సందర్శించడానికి వెళ్ళవచ్చు.

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చాలా చోట్ల దాండియా నైట్స్ నిర్వహిస్తున్నారు. ఈ నగరంలోని ఇతర ప్రదేశాల మాదిరిగానే, గర్బా, దాండియా నైట్స్‌ని నిర్వహించడానికి చాలా రోజుల ముందుగానే సన్నాహాలు చేశారు. గర్బా లేదా దాండియా నైట్‌ని ఆస్వాదించే వారికి వేడుక తర్వాత బహుమతులను కూడా అందిస్తున్నారు.

సూరత్: దాండియా లేదా గర్బా అనగానే అందరి మదిలోనూ ముందుగా గుర్తుకొచ్చేది గుజరాత్. నవరాత్రి ఉత్సవాల్లో గుజరాతీ సంస్కృతిని ఎలా మర్చిపోగలరు? దాండియాకు పునాదిగా భావించే గుజరాత్‌లోని సూరత్‌లో నవరాత్రులు విభిన్నంగా జరుపుకుంటారు. సూరత్‌ను దాండియా లేదా గర్బా నగరం అని కూడా అంటారు.

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నివసించేవారు కూడా దాండియా నైట్స్‌ని ఆస్వాదించవచ్చు. అనేక ప్రదేశాల్లో నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ గర్బా లేదా దాండియా నైట్స్ ను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో నవరాత్రి ఉత్సవాలు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి.

ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో దాండియా సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. నగరంలో నవరాత్రి వేడుకల కోసం దాండియా రాత్రులు కూడా నిర్వహిస్తారు. ఈ నగరంలో దాండియా నైట్స్ నిర్వహించబడుతున్నాయి. డోమ్ రాస్ గర్బా కూడా ఇక్కడే జరుగుతుంది.