Yadadri Temple: దేశంలో రామాయణానికి ఎంత ప్రశస్థి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామాయణంలోని ప్రతి ఘట్టం మహాదాద్భుతం. అలాంటి సంపూర్ణ రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టేలా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సన్నిధిలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు అధికారులు. యాదాద్రి దివ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని నూతనంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు సంపూర్ణ రామాయణ ఘట్టాలు కళ్లకు కట్టేలా ఆలయ నిర్మాణాలపై చిత్రీకరిస్తున్నారు.
ప్రధానాలయ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన కళ్యాణ మండప స్తంభాలపై సంపూర్ణ రామాయణ ఘట్టాలను చెక్కారు. సీతారాముల జననం, రామ, లక్ష్మణ, భరత, శత్రఘ్నుల విద్యాభ్యాసం, సీతా స్వయంవరం, సీతారాముల వివాహం, అరణ్య వాసం, లంకాదహనం ఇలాంటి ముఖ్యమైన రామాయణ ఘట్టాలన్నీ శిల్పాలపై చెక్కారు. ఈ రామాయణ ఘట్టాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇదిలాఉండగా, యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయం దాదాపు పూర్తి కావొచ్చింది. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీడియో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
Also read: