
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామ నగరం సమతామూర్తి కేంద్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి 69 వ తిరునక్షత్ర మహోత్సవాల తొలి రోజు సాయంత్రం సాంసృతిక కార్యక్రమం సంగీత ప్రియులను అలరించింది. కామాండూరి రామాచార్యుల నిర్వహణలో 69 వ మంది బాలగంధర్యులచే 69 గీతాల సమాహర సమర్పణ కార్యక్రమం నిర్వహించారు.
69 వ తిరు నక్షత్ర మహోత్సవానికి హాజరైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కు జీయర్ స్వామి సేవా శిరోమణి పురస్కారం అందుకున్నారు. స్థాట్యూ అఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి హైదరాబాద్ కు గర్వకారణం అన్నారు. చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనాలు అందుకోవడం చాలా సంతోషం అన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఈ ఉత్సవాల్లో చివరి రోజు అంటే ఈ నెల 25వ తేదీ స్వామి వారి ఆరాధ్యమైన రాముడికి సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..