Chhath Festival: ఉత్తరాదిలో ఛత్‌ ఫెస్టివల్‌ సందడి.. విషపు నురగల మధ్యే భక్తుల పుణ్యస్నానాలు..

Chhath Festival Celebrations: ఢిల్లీలోని యమునా నది కాలుష్య కాసారంగా మారింది. వివిధ పరిశ్రమల వ్యర్థాలను యమునా నదిలోకే విడుదల చేయడంతో నీరు మొత్తం కలుషితం అయిపోయింది. దీంతో నది ఉపరితలంపై విషపూరిత నురుగు తేలుతూ ప్రవహిస్తోంది. అయితే విషపు నురగలపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులపాటు ఛత్ పూజా వేడుకలు ఉండటంతో పుణ్యస్నానాలు ఎలా చేయాలని భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

Chhath Festival: ఉత్తరాదిలో ఛత్‌ ఫెస్టివల్‌ సందడి.. విషపు నురగల మధ్యే భక్తుల పుణ్యస్నానాలు..
Chhath Festival

Updated on: Nov 20, 2023 | 9:15 AM

Chhath Festival Celebrations: ఢిల్లీలోని యమునా నది కాలుష్య కాసారంగా మారింది. వివిధ పరిశ్రమల వ్యర్థాలను యమునా నదిలోకే విడుదల చేయడంతో నీరు మొత్తం కలుషితం అయిపోయింది. దీంతో నది ఉపరితలంపై విషపూరిత నురుగు తేలుతూ ప్రవహిస్తోంది. అయితే విషపు నురగలపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులపాటు ఛత్ పూజా వేడుకలు ఉండటంతో పుణ్యస్నానాలు ఎలా చేయాలని భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ‘నహయ్-ఖాయ్’ ఆచారంతో ఛత్‌ ఫెస్టివల్‌ ఘనంగా జరుగుతోంది. తెల్లవారుజామునుంచే భక్తులు యమునా నదితోపాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృత్రిమ చెరువుల్లో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పవిత్ర కాళింది అంటే యమునాలో పుణ్యస్నానాలు చేసి సూర్యుడిని ప్రార్థిస్తున్నారు. ఛత్‌ ఫెస్టివల్‌ ప్రధానంగా ఢిల్లీ, యూపీ, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ పండుగ సమయంలో భక్తులు ఉపవాసంతోపాటు పుణ్య నదుల్లో స్నానం చేసి సూర్యుడిని ఆరాధిస్తారు.

కాగా.. ఛత్ వేడుకల నేపథ్యంలో ఘాట్ ల వద్ద భద్రను పెంచారు. ఛత్ వేడుకల కోసం 1,000 కృత్రిమ చెరువులను ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాలుష్యం కారణంగా యమునా నదిలో పుణ్య స్నానాలకు బదులు.. కృత్రిమ చెరువుల్లో పుణ్య స్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేశారు.

ఛత్ ప్రధానంగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. పండుగ సమయంలో, ప్రజలు ఉపవాసం ఉంటారు. నదులలో పుణ్య స్నానం ఆచరించి.. తమ కోరికలు నెరవేరాలని సూర్య భగవానుడికి పూజలు చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..