ఈ రోజు ఆషాడ తొలి ఏకాదశి. ఈ పర్వదినం నుంచి హిందువుల పండగలు ప్రారంభమవుతాయి. అంతేకాదు.. నేటి నుంచి చాతుర్మాసం ప్రారంభమైంది. జూన్ 29న ప్రారంభమైన చాతుర్మాసం నవంబర్ 23వ తేదీ వరకూ అంటే అధిక శ్రావణ మాసం రావడంతో దాదాపు 148 రోజులు పాటు..( 5 నెలల) వరకు ఏ శుభ కార్యం నిర్వహించారు. నేడు క్షీర సాగరంలో శేషుడిపై శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లాడని నమ్మకం. అనంతరం మహా విష్ణువు నవంబర్ 23 న దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడు. విష్ణుమూర్తి యోగ నిద్రతో ప్రారంభమైన చాతుర్మాసం కార్తీకమాసంలో దేవుత్తని ఏకాదశి రోజున ముగుస్తుంది.
వాస్తవానికి చాతుర్మాసం నాలుగు నెలల పాటు ఉంటుంది. అయితే ఈ ఏడాది అధిక శ్రావణ మాసం వచ్చింది. అంటే శ్రావణ మాసం నిజ శ్రవణం, అధిక శ్రవణంగా రెండు నెలలు ఉండనుంది. కనుక చాతుర్మాసం ఈ ఏడాది ఐదు నెలలు వచ్చిందని. ఈ సమయంలో శ్రీమహావిష్ణువును పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. చాతుర్మాసంలో వివాహంతో సహా శుభ కార్యాలకు దూరంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ చాతుర్మాస దీక్ష సమయంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు ఈ రోజు తెలుసుకుందాం..
చాతుర్మాసం ప్రాముఖ్యత:
ఈ చాతుర్మాసంలో దీక్ష చేపట్టిన భక్తులు మహా విష్ణువు, లక్ష్మీదేవి దంపతులను నిర్మలమైన హృదయంతో నియమ నిష్టలతో పూజించడం వలన ఇహపర సౌకర్యలను అనుభవిస్తారు. మోక్షాన్ని పొందుతారు. అంతేకాదు జీవితంలో సుఖ సంపదలకు లోటు ఉండదని విశ్వాసం. శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నందున ఈ నెలల్లో వివాహం, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు చేయకూడదని హిందువుల విశ్వాసం. ఈ సమయంలో మహావిష్ణువు, మహాదేవుడు పూజ అత్యంత శుభప్రదం
చాతుర్మాసంలో చేయకూడని పనులు
చాతుర్మాసంలో చేయాల్సిన పనులు
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..
Note : ఈ కథనంలో తెలిపిన సమాచారం నమ్మకాల మీద ఆధారితం. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంకా టీవీ9 తెలుగు ఈ సమాచారాన్ని దృవీకరించడం లేదు.