Chardham Yatra: చార్‌ధామ్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం.. కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత.. అదేదారిలో గంగోత్రి, బద్రీనాథ్!

|

Nov 07, 2021 | 7:13 AM

హిమాలయాల్లో ఉన్న ప్రఖ్యాత కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలను శనివారం నుంచి మూసివేస్తున్నట్లు చార్‌ధామ్ ధర్మకర్తల మండలి తెలిపింది.

Chardham Yatra: చార్‌ధామ్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం.. కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత.. అదేదారిలో గంగోత్రి, బద్రీనాథ్!
Chardham Yatra
Follow us on

Chardham Yatra: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పూజలందుకున్న ప్రముఖ ఆలయాలు మూసివేశారు. హిమాలయాల్లో ఉన్న ప్రఖ్యాత కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలను శనివారం నుంచి మూసివేస్తున్నట్లు చార్‌ధామ్ ధర్మకర్తల మండలి తెలిపింది. ఈ ఆలయాలను భారీగా మంచుపడే శీతాకాలంలో ఏటా మూసివేస్తుంటారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలను శనివారం ఉదయం 8 గంటలకు, యమునోత్రి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసినట్లు చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డ్‌ తెలిపింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని పేర్కొంది.

శీతాకాల బసకోసం ఆయా ఆలయాల్లోని బాబా కేదార్, మాత యమున విగ్రహాలను అందంగా అలంకరించిన పల్లకిలో ఉఖిమఠ్, ఖర్సాలీ ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు తెలిపింది. గంగోత్రి ఆలయం శుక్రవారం మూతపడగా, బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలను ఈ నెల 20వ తేదీన మూసివేయనున్నట్లు చార్‌ధామ్ బోర్డ్ వెల్లడించింది.

Read Also…  GHMC-BJP: గ్రేటర్ హైదరాబాద్ బీజేపీలో గందరగోళం.. 10నెలలుగా జరగని ఫ్లోర్ లీడర్ ఎంపిక