
ప్రతి ఒక్కరూ జీవితంలో మంచి స్నేహితుడు ఉండాలని కోరుకుంటారు. అలాంటి స్నేహితుడి కోసం వెతుకుతారు. ప్రతి సంతోషంలోను, దుఃఖంలోను మనతో ఉండి.. మనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ పంచుకోగలిగే వాడే స్నేహితుడు. అయితే ఇలాంటి స్నేహితుడిని కనుగొనడం అందరికీ సాధ్యం కాదు. అయితే ‘చాణక్య నీతి’లో స్నేహితుల ఎంపిక గురించి చాలా విషయాలు స్పష్టంగా చెప్పబడ్డాయి. అలాగే స్నేహితుడిని విశ్వసించడానికి అనేక కారణాలు.. స్పష్టమైన మార్గదర్శకత్వం ఇవ్వబడ్డాయి. ప్రతి ఒక్కరినీ స్నేహితులుగా చేసుకోలేమని.. ప్రతి స్నేహితుడిని గుడ్డిగా నమ్మలేమని చెప్పాడు చాణక్యుడు. అయితే పూర్తిగా విశ్వసించదగిన వ్యక్తులు ఉంటారని.. వాటితో మన జీవితంలో ఎవరికీ తెలియని రహస్యాలను సైతం పంచుకోవచ్చు అని చెప్పాడు. ఈ రోజు మంచి స్నేహితుడికి ఉండే లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం..
అవసరంలో ఉన్నప్పుడు ఆడుకునే స్నేహితుడు..
చాణక్యుడు కష్టకాలంలో నిన్ను విడిచిపెట్టని వాడే నిజమైన స్నేహితుడని చెప్పాడు. మీ జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు.. ఎవరైతే నిస్వార్థంగా మీతో నిలుస్తాడో అతనే నిజమైన స్నేహితుడు. అతను నమ్మదగిన వ్యక్తీ అని చాణక్య నీతిలో పేర్కొన్నాడు.
త్యాగం గుణం ఉన్న ఫ్రెండ్
చాణక్యుడి ప్రకారం తన స్వార్థాన్ని పక్కనపెట్టి.. తన స్నేహితుడి బాగు కోసం నిర్ణయాలు తీసుకునే వ్యక్తి లేదా మీ కోసం తన ఆనందాన్ని సైతం త్యాగం చేసే వాడు నిజమైన స్నేహితుడు. నమ్మకమైన స్నేహితుడు. అలాంటి వ్యక్తి అత్యంత నమ్మకస్థుడని .. జీవితంలో విడిచి పెట్టవద్దు అని సూచించాడు.
రహస్యాలు దాచే స్నేహితుడు
మీ మాటలను, రహస్యాలను ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఇతరులతో పంచుకోని వ్యక్తులు మీ జీవితంలో చాలా విలువైనవారని చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. మీరు లేనప్పుడు కూడా మీ గురించి చెడుగా మాట్లాడకుండా.. మీ ఇమేజ్‌ను కొనసాగించే వ్యక్తి .. నిజమైన స్నేహానికి విలువ ఇచ్చే వాడు. అటువంటి స్నేహితుడు అన్ని విధాలుగా విలువైనవాడు.
ఎల్లప్పుడూ సలహా ఇచ్చే స్నేహితుడు
మీకు ఎటువంటి సందర్భం ఎదురైనా సరే పరిస్థితికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సరైన సలహా ఇస్తూ.. మీ తప్పులను నిస్సంకోచంగా ఎత్తి చూపిస్తూ … మీకు సరైన దిశను చూపించే వ్యక్తి.. నిజమైన స్నేహితుడు.. శ్రేయోభిలాషి. అలాంటి స్నేహితుడిని నమ్మడం సముచితమే కాదు, అవసరం కూడా అని ఆచార్య చాణక్య చెప్పాడు.
కష్ట సమయంలో విడువని వాడు
జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు.. ఆటువంటి కష్ట సమయంలో కూడా మీ స్నేహాన్ని, మీ సహవాసాన్ని విడకుండా తోడునీడగా ఉండే వ్యక్తీ మంచి స్నేహితుడని.. అటువంటి వ్యక్తుని స్నేహితుడిగా గుడ్డిగా కూడా నమ్మవచ్చు అని చాణక్యుడు చెప్పాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు