
చాణక్యుడి విధానం గురించి తెలిసిందే.. మానవ జీవన విధానంతో పాటు రాష్ట్ర విధానాలు, పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడం కోసం చాణక్యుడు కొత్త దృక్పథంతో ఆలోచించేవాడు. చాణక్యుడు అలెగ్జాండర్ యుద్ధ వ్యూహాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. చాణక్యుడు ఒక భారతీయ దౌత్యవేత్త, వ్యూహకర్త. చాణక్యుడిని విష్ణు శర్మ, కౌటిల్యుడని కూడా పిలుస్తారు. చాణక్యుడి విధానాలు, ఆలోచనలు, జ్ఞానం, దౌత్యం, ప్రణాళికా శక్తి ఇప్పటికీ ప్రజలకు జ్ఞానానికి సంబంధించిన అంశాలు.
చాణక్యుడు శారీరక బలం, సైనిక శక్తిపై మాత్రమే దృష్టి పెట్టలేదు. వ్యూహాలు, దౌత్యం, ప్రణాళికలను కలిపి యుద్ధ వ్యూహాన్ని నిర్ణయించేవాడు. అందుకే నేడు ప్రజలు చాణక్యుడి విధానాలు, ఆలోచనలను అధ్యయనం చేసి వాటిని మార్గదర్శకత్వంగా తీసుకుంటారు. కనుక యుద్ధం నీతిని గురించి చాణక్య నీతి ఏమి చెబుతుందో తెలుసుకుందాం.
శత్రువును తక్కువ అంచనా వేయకండి: ఎవరైనా సరే శత్రువును ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు లేదా అతన్ని బలహీనుడిగా భావించే పొరపాటు చేయవద్దు. శత్రువు గురించి ప్రతి విషయం, ప్రతి బలం, ప్రతి బలహీనత గురించి మీరు తెలుసుకోవాలి. తద్వారా శత్రువుని సులభంగా ఓడించవచ్చు.
శత్రువుల ప్రతి కదలికపై నిఘా: మీ శత్రువు కార్యకలాపాలను ఎటువంటి సమయంలో కూడా ఎప్పుడూ విస్మరించవద్దని.. ఎల్లప్పుడూ శత్రువుపై నిఘా ఉంచాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు.
తెలివితేటలతో శత్రువును ఓడించండి: మీ శత్రువు మీ కంటే బలవంతుడు అయితే ఆ విషయం మీకు తెలిస్తే.. అప్పుడు బలప్రదర్శనతో కాకుండా.. అతడిని తెలివితేటలతో ఓడించాలి. శత్రువు మీకంటే బలవంతుడైతే.. అప్పుడు కొంత సమయం సిద్ధమైన తర్వాత శత్రువుని ఓడించడానికి ప్రతిస్పందించడం సముచితం.
సరైన సమయం కోసం వేచి ఉండండి: చాణక్యుడి ప్రకారం శత్రువు బలహీనతను సరైన సమయంలో సద్వినియోగం చేసుకోవాలి. యుద్ధానికి ముందు చాలా ఓపిక ఉండాలి.
సామ, దాన, భేద, దండోపాయాలు: శత్రువు మీద యుద్ధానికి వెళ్ళే ముందు ఈ నాలుగు పద్ధతులను అవలంబించాలని చాణక్యుడు చెప్పాడు.
“సామ” – ప్రశాంతంగా మాట్లాడటం.. మంచి మాటలతో చక్కగా చెప్పు… మారకపోతే
దాన- ఏదైనా ఇచ్చి చెప్పు అప్పుడు కూడా మారకపోతే
బేధ – గొడవపడి చెప్పు.. ఇపుడు కూడా మారకపోతే
దండం- ఎంత మంచిగా చెప్పినా మారకపోతే చివరికి బలప్రయోగం అంటే కొట్టి చెప్పు
అంటే యుద్ధం చివరి ఎంపిక: యుద్ధం ఎల్లప్పుడూ చివరి ఎంపిక అని చాణక్యుడు నమ్మాడు. శాంతి, దౌత్యం , సంభాషణలు పనిచేయనప్పుడు యుద్ధం చివరి ప్రయత్నంగా ఉండాలని రాజనీతిలో సూచించాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు