Chanakya Niti: యువకుల కోసం చాణక్య చెప్పిన టాప్ సీక్రెట్.. పాటిస్తే పండగే.. లేదంటే జీవితాంతం ఏడుపే..

|

Dec 13, 2022 | 1:08 PM

ఆచార్య చాణక్యుడు క్రీస్తు పూర్వం 300 శతాబ్ధానికి చెందిన వాడైనప్పటికీ.. నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయుడు. కారణం ఆయన లక్షణాలు, ఆయన చాటిచెప్పిన విధానాలు, సూచనలు. ఒక ఉపాధ్యాయుడు, రచయిత, వ్యూహకర్త, తత్వవేత్త,

Chanakya Niti: యువకుల కోసం చాణక్య చెప్పిన టాప్ సీక్రెట్.. పాటిస్తే పండగే.. లేదంటే జీవితాంతం ఏడుపే..
Chanakya Niti
Follow us on

ఆచార్య చాణక్యుడు క్రీస్తు పూర్వం 300 శతాబ్ధానికి చెందిన వాడైనప్పటికీ.. నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయుడు. కారణం ఆయన లక్షణాలు, ఆయన చాటిచెప్పిన విధానాలు, సూచనలు. ఒక ఉపాధ్యాయుడు, రచయిత, వ్యూహకర్త, తత్వవేత్త, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, రాజ సలహాదారుగా ఎంతో మేధస్సు కలిగిన పురాతన భారతీయ బహుభాషావేత్త చాణక్యుడు. వ్యక్తి జీవితానికి సంబంధించిన ఆయన చేసిన సూచనలు, సలహాలు, మార్గనిర్దేశనాలు నేటి ప్రజలకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. అందుకే నేటి ప్రజల్లో కూడా ఆయనంటే ప్రత్యేక గౌరవం. ఆయన సలహాలు, సూచనలను నేటికీ ఆచరిస్తుంటారు. ఒక సాధారణ వ్యక్తి అయిన చంద్రగుప్తుడుని.. భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద మౌర్యసామ్రాజ్య స్థాపనకు ప్రేరేపించిన ఘనుడు చాణక్యుడు. అందుకే ఆయనను ఆచార్యుడు అని కూడా అంటారు.

ఆచార్య చాణక్యుడు తాను రాసిన నీతిశాస్త్రం గ్రంథంలో యవ్వనం గురించి అనేక విషయాలు పేర్కొన్నారు. యవ్వనం అనేది జీవితంలో ఒక దశ అని, ఆ దశలోనే మన రేపటి భవిష్యత్ నిర్ణయించబడుతుందని చెప్పాడు చాణక్యుడు. ఈ దశలో తప్పులు చేస్తే.. భవిష్యత్‌లో దాని పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. వ్యక్తులు తమ యవ్వనం కొన్ని పనులు చేయకూడదని, కొన్ని అలవాట్లను త్యజించాలని సూచించారు చాణక్యుడు. మరి ఆ అలవాట్లు ఏంటి? ఏం చేయకూడదు? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

సమయం వృధా..

యువత తమ జీవితంలో ఏ దశలోనూ సమయాన్ని వృథా చేయకూడదు. సమయం చాలా విలువైనది. దాని ప్రాముఖ్యతను గ్రహించి.. ప్రతీ సెకన్‌ను సద్వినియోగం చేసుకోవాలి. లేదంటే జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సమయాన్ని సరైన దిశగా సద్వినియోగం చేసుకుంటే జీవితంలో విజయం సాధించడం తథ్యం.

ఇవి కూడా చదవండి

డబ్బును వృధా చేయకూడదు..

డబ్బును వృధా చేయకూడదు. డబ్బు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. డబ్బు పట్ల నిర్లక్ష్యం, ఉదాసీనత మానుకోవాలి. ఎంతటి ధనవంతులైనా, పేదవారైనా డబ్బును పొదుపుగా వినియోగించాలి.

సోమరితనం..

అన్నికంటే ముఖ్యంగా యువత తమ బద్దకాన్ని వీడాలి. సోమరితనం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సోమరితనం వ్యక్తికి అతిపెద్ద శత్రువు. ఆ బద్దకాన్ని జయిస్తే.. జీవితంలో ప్రతీది విజయమే. యవ్వనంలో ఖచ్చితంగా సోమరితనాన్ని వీడాలి.

కోపాన్ని నియంత్రించుకోవాలి..

కోపం ప్రతీ ఒక్కరి జీవితాన్ని నాశనం చేస్తుంది. యవ్వనంలో కోపం మనపై ఆధిపత్యం చెలాయిస్తుంది. కోపంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఫలితంగా జీవితం అస్తవ్యస్తం అవుతుంది. కోపాన్ని జయించిన వారు జీవితంలో రాణించగలుగుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..