Chanakya Niti: ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతిలో నేటి మానవుడి నడవడికను నిర్దేశిస్తుంది. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక, పిల్లల పెంపకం వంటి అనేక విషయాలను వివరిస్తూ.. చాణుక్యుడు నీతి శాస్త్రం రచించారు. నేటి తల్లిదండ్రులు తమ పిలల్ల జీవితం గురించి బంగారుకలలు కంటారు. అయితే తల్లిదండ్రులు పిల్లల ఈ అలవాట్లను విస్మరించకండి.. అప్పుడు మీరు భవిష్యత్తులో ఖచ్చితంగా పశ్చాత్తాపపడవలసి ఉంటుందని చాణుక్యుడు చెప్పాడు. పిల్లలను పెంచేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి నుండి మంచి విషయాలు నేర్పండి .. వారి చెడు అలవాట్లను సరిదిద్దండి.. లేకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. అవి ఏమిటో తెలుసుకుందాం..
మీ బిడ్డ మీతో అబద్ధం చెబితే.. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లల ఈ అలవాటును సరిదిద్దడానికి ప్రయత్నించాలి. అబద్ధం చెప్పే అలవాటు రోజు రోజుకీ అధికమవుతుంది. కనుక తల్లిదండ్రులు సకాలంలో చర్యలు తీసుకోకపోతే, ఆ పిల్లవాడు ఎప్పుడూ అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాదు అలాగే తప్పు మార్గంలో వెళ్ళవచ్చు. అది తల్లిదండ్రులు గమనించలేరు. కనుక పిల్లలకు మొదటి నుంచీ నిజం చెప్పే అలవాటును తల్లిదండ్రులు నేర్పించాలి.
చాణక్యుడు ప్రకారం.. పిల్లలు చెప్పే ప్రతిదాన్ని వినవద్దు. వారు చెప్పే విషయాలను జాగ్రత్తగా వినండి.. వారికి తగినంత సమయం ఇవ్వండి. తప్పుఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని పిల్లలకు చెప్పండి. వారు అడిగినవి వెంటనే ఇవ్వకండి. మితిమీరిన గారాబం వలన పిల్లల అలవాట్లలో మార్పులు వస్తాయి. అంతేకాదు వారిలో మొండితనం పెరుగుతుంది.
పిల్లలు తడి మట్టి లాంటివారు. పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతారు. కనుక తల్లిదండ్రుల అలవాట్లను పిల్లలు అనుసరిస్తారు. అందువల్ల, మీ సంయమనంతో కూడిన ప్రవర్తనను పిల్లల ముందు ప్రదర్శించండి, తద్వారా పిల్లలు తల్లిదండ్రుల నుంచి విలువలను స్వీకరిస్తారు.
ఇక తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల ముందు ఎప్పుడూ గొడవ పడకూడదు. పిల్లలలో కోపం, చిరాకును కలుగుతుంది. చిన్నతనం నుండే పిల్లల్లో మంచి విలువలను నేర్చుకోవడానికి వీలుగా పునాది వేయండి. గొప్ప వ్యక్తుల గురించి వారికి చెప్పండి. భవిష్యత్తులో ఏదైనా మంచి పని చేయడానికి పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేరేపించండి.
Also Read: నేడు ధనుస్సురాశిలోకి సూర్యుడు.. జనవరి 14వరకూ ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..