Chanakya Niti: పిల్లల ముందు పెద్దలు ఎప్పుడూ ఇలా ప్రవర్తించకండి.. లేకపోతే తల్లిదండ్రులు జీవితాంతం బాధపడవలసి ఉంటుంది

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన జీవితంలో ఎదురైనా పరిస్థితులను , అనుభవాలను విశదీకరిస్తూ.. చాణక్య నీతి శాస్త్రం రచించాడు. చాణుక్యుడు పండితుడు..

Chanakya Niti: పిల్లల ముందు పెద్దలు ఎప్పుడూ ఇలా ప్రవర్తించకండి.. లేకపోతే తల్లిదండ్రులు జీవితాంతం బాధపడవలసి ఉంటుంది
Acharya Chanakya

Updated on: Dec 24, 2021 | 7:55 AM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన జీవితంలో ఎదురైనా పరిస్థితులను , అనుభవాలను విశదీకరిస్తూ.. చాణక్య నీతి శాస్త్రం రచించాడు. చాణుక్యుడు పండితుడు మాత్రమే కాదు గొప్ప దౌత్యవేత్త, రాజకీయవేత్త కూడా.  సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను నీతి శాస్త్రంలో విశదీకరించారు.  అలాంటి వాటిల్లో ఒకటి మనుషుల మధ్య ఉండే బంధాలు.. ఆ బంధాలను నిలబెట్టుకోవడానికి నడవడిక.. బంధం విడిపోతే మనిషి పడే తపనని చాణక్య నీతి ద్వారా నేటి సమాజానికి అందించాడు. చాణుక్యుడు పిల్లల పెంపకం గురించి తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశారు. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ఉండాలి.. ఏమి చేయకూడదు అనే విషయాలను చాణుక్యుడు చెప్పాడు. ఈరోజు అవేమిటో చూద్దాం..

క్రమశిక్షణారాహిత్యం: 
పిల్లల ముందు ఎప్పుడూ క్రమశిక్షణారాహిత్యాన్ని ప్రదర్శించవద్దు. పిల్లలు అమాయకులని గుర్తుంచుకోండి. వారికి వారి తల్లిదండ్రులే మొదటి పాఠశాల. పిల్లలు తల్లిదండ్రులు తమ ముందు ఎలా ఉంటే.. వాటిని ఉదాహరణలనుగా తీసుకుని నేర్చుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల ముందు క్రమశిక్షణా రాహిత్యంగా ఉంటే పిల్లలు నిరంకుశంగా మారతారు. అప్పుడు తల్లిదండ్రులు భవిష్యత్తులో  పిల్లల చేష్టలను భరించవలసి ఉంటుంది.

అబద్ధం చెప్పటం: 
చాలా సార్లు తల్లిదండ్రులు కొన్ని విషయాలను దాచడానికి అబద్ధం చెప్పమని పిల్లలను అడుగుతారు. అయితే పిల్లలు ఒకసారి అబద్ధం చెప్పడం మొదలు పెడితే.. భవిష్యత్తులో కూడా అబద్ధాలను ఆశ్రయిస్తాడు. తల్లిదండ్రులకు కూడా అబద్ధం చెప్పడం ప్రారంభిస్తాడు. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు అబద్ధాలు చెప్పకండి..  పిల్లలను అబద్ధాలు మాట్లాడనివ్వకండి.

తగని ప్రవర్తన 
పిల్లల ముందు ఎప్పుడూ తల్లిదండ్రులు తప్పుడు పదాలు వాడకూడదు.  పిల్లలు పెద్దవారి మాటలను  అనుసరిస్తారు. అదే తప్పు పదాలు చెప్పడం నేర్చుకుంటారు. అందువల్ల, పిల్లల ముందు ఎప్పుడూ అనుచితమైన ప్రవర్తనను ప్రదర్శించవద్దు.

భార్యకు అవమానం
పిల్లల ముందు ఏ భర్త.. తన భార్యను ఎప్పుడూ అవమానించకూడదు. అదేవిధంగా భార్య తన భర్తను అవమానించకూడదు. పిల్లలు వారి తల్లిదండ్రుల నుండి సంబంధాల ప్రాముఖ్యతను నేర్చుకుంటారు. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోకపోతే.. పిల్లలు కూడా అదే చేస్తాడు. కనుక ఎల్లప్పుడూ తల్లిదండ్రుల సంబంధాలను గౌరవించండి.

Also Read:  అనంతనాగ్‌ అర్వానీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ ..