
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Chanakya) బహుముఖ ప్రజ్ఞాశాలి. సమాజం, మనుషుల నడవడిక ఇలా అనేక విషయాలపై అవగాహన కలిగి ఉన్నాడు. తన అనుభవాలను అనేక శాస్త్రాలుగా లిఖించాడు. చాణుక్యుడు రచించిన నీతి శాస్త్రం (chanakya niti)నేటి మానవులకు అనేక జీవిన విధానాలను నేర్పుతుంది. వాటిని ఆచరిస్తే.. ఆ మనిషిజీవితం ఏ కలతలు, కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుందని పెద్దల నమ్మకం.. దేవుడు మానవులకు ప్రత్యేక లక్షణాలను ఇచ్చాడని, దానిని అందరూ గౌరవించవలసి ఉంటుందని ఆచార్య చాణక్యుడు నమ్మాడు. ఈ ప్రత్యేక లక్షణాలు మనిషిని జంతువుల నుండి వేరు చేస్తాయి. అటువంటి పరిస్థితిలో, వ్యక్తి లక్షణాలను మెరుగుపరచుకోవాలి. ఆచార్య 5 లక్షణాలను ప్రస్తావిస్తూ, ఇలా చేయని వారి జీవితం.. జంతువులతో సమానమని చెప్పారు.
ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలోని ఒక శ్లోకం ద్వారా మనిషిలోని కొన్ని గుణాల గురించి చెప్పాడు. శ్లోకం- ‘యేషాం న విద్యా న తపో న దానం జ్ఞానం న శీలం న గుణో న ధర్మః, తే మాత్ర్యా లోకే భువి భారభూత మనుశ్రుపేణ మృగశ్చరన్తి’ ఈ శ్లోకంలో ఆచార్యులు అభ్యాసం, తపస్సు, దానత్వం, వినయం యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పాడు. వాటి గురించి మానవులు తెలుసుకోవాలి.
ఆచార్య .. వ్యక్తి జ్ఞానం జ్ఞానాన్ని పొందడం ద్వారా వచ్చే గుర్తింపు. అతను విద్యావంతుడుగా నడుచుకుంటాడు. సమాజంలో గౌరవం మరియు ప్రతిష్టను పొందుతాడు. అందువల్ల వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞాన సముపార్జనా భాగ్యం మానవులకే ఉంది, జంతువులకు కాదు.
మనుష్యులు ముక్తి మార్గం వైపు పయనించేటట్లు చేసే గుణాన్ని భగవంతుడు ప్రసాదించాడు. అటువంటి పరిస్థితిలో, మంచి పనులతో పాటు, తపస్సు కోసం ఖచ్చితంగా కొంత సమయం కేటాయించాలి.
ధార్మికత ప్రాముఖ్యత గ్రంథాలలో కూడా చెప్పబడింది. దానం చేయడం వల్ల మీ చెడు కర్మలు తొలగిపోయి మీ జీవితం సుసంపన్నం అవుతుంది. తనకోసం సంపాదించి దానం చేయని వ్యక్తి.. పశువుతో సమానం
వినయం ఎల్లప్పుడూ జ్ఞానం నుండి వస్తుంది. మీరు ఎంత వినయంగా ఉంటే, మీ వ్యక్తిత్వం అంత గొప్పగా ప్రకాశిస్తుంది. కనుక ఎటువంటి సమయంలోనైనా వినయంగా ఉండండి.
Also Read: