Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) తన నీతి శాస్త్రం(Niti Shastra)లో అనేక జీవన విధానాలను ప్రస్తావించాడు. చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు నేటికీ అనుసరణీయమని పెద్దలు చెబుతుంటారు. విద్యార్థులకు ఎలా చదువుకోవాలి.. విద్యనభ్యసించే సమయంలో ఎటువంటి నియమాలను పాటించాలి వంటి అనేక సూచనలు చేశాడు చాణక్యుడు. ఈరోజు చాణుక్యుడు విద్యార్థులకు చెప్పిన కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం..
ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఏ వ్యక్తి జీవితంలోనైనా విద్యార్థి జీవితం ఒక ముఖ్యమైన దశ. తప్పులు చేస్తూ.. వాటిని సరిదిద్దుకోవడంలో విద్యార్ధ దశలో విలువైన సమయాన్ని కోల్పోతారు. కనుక సర్వసాధారణంగా తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దని చెప్పాడు. అందుకే ఈవిద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో మీ లక్ష్యం కోసం కష్టపడాలి. ఆచార్య చాణక్యుడు విద్యార్థులు ఏ సందర్భంలోనైనా తమ లక్ష్యాలను సాధించడానికి కొన్ని నియమాలను పాటించాలని సూచించారు.
విద్యార్థులు ఏదైనా పని చేయడానికి సమయ పరిమితిని నిర్దేశించుకోండి , ఆ సమయంలో ఆ పనిని పూర్తి చేయండి. ఈ నియమాన్ని అనుసరించే విద్యార్థి, ఏ సందర్భంలోనైనా తన లక్ష్యాన్ని సాధిస్తాడు. తనకంటూ ఓ కెరీర్ ను రూపొందించుకుంటాడు.
నేటి పనిని నేడే పూర్తీ చేయండి. ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయకండి. మీరు పనిని రేపటికి వాయిదా వేస్తే, దానిలో కొంత అంతరాయం ఏర్పడవచ్చు. లేదా ఆ పని పూర్తిగా వాయిదా పడే అవకాశం ఏర్పడవచ్చు. లేదా ఆ పని పూర్తి కాకపోవచ్చు. కనుక ఈరోజు చేయాల్సిన పనిని ఈరోజే పూర్తి చేయండి.
స్నేహం చేసే విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి.. ఆలోచనాత్మకంగా స్నేహం చేయండి. స్నేహం విషయంలో విద్యార్థి దశలో చేసే తప్పు.. మొత్తం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది. మీ లక్ష్యం నుండి మిమ్మల్ని మళ్లించవచ్చు. ఇది మీ విజయానికి అతి పెద్ద అడ్డంకి. కాబట్టి మంచి తనం, నమ్మకమైన వ్యక్తులను స్నేహితులుగా చేసుకోండి.
విద్యార్థి జీవితంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఎలాంటి మాదకద్రవ్య వ్యసనానికి గురికావద్దు. చెడు అలవాట్లను చేసుకున్న వ్యక్తి తన జీవిత మార్గం దారి.. తప్పుడు దారి పెట్టె అవకాశం ఉంది. చెడు వ్యసనాలు వ్యక్తి మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇది విద్యార్థులకు పెద్ద శాపంగా మారుతుందని చాణక్యుడు చెప్పాడు.
Also Read: Hyderabad Rains: భాగ్యనగర వాసులను పకరించిన వరుణుడు.. చల్లబడిన నగరం.. రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం