Chanakya Neeti
Chanakya Niti: ఆచార్య చాణుక్యుడు(Acharya Chanakya) గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, సామాజిక శాస్త్రం మొదలైన అన్ని విషయాలపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉంది. చాణక్యుడి తన జీవిత సారాన్ని, అనుభవాలను నీతి శాస్త్రం(Niti shastra)లో పొందుపరిచాడు. ణుక్యుడు ఏదైనా పరిస్థితిని ముందుగానే ఊహించి, దానిని ఎదుర్కోవటానికి వ్యూహాన్ని సిద్ధం చేసేవాడు. చాణక్య నీతి పుస్తకంలోని అంశాలు నేటికీ అనుసరణీయమని పెద్దల నమ్మకం. ఈరోజు చాణుక్యుడు ఈ ఐదుగురు వ్యక్తులతో శత్రుత్వం చేయవద్దని చెప్పాడు..
- చేతిలో ఆయుధం ఉన్న వ్యక్తితో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోవద్దని చాణక్య చెప్పాడు. అలాంటి వ్యక్తితో స్నేహం, శత్రుత్వం మీ జీవితాన్ని ప్రమాదానికి కారణం. కనుక అటువంటి వ్యక్తికీ దూరంగా ఉండడం తెలివైన పని.
- వైద్యునితో , వంటవాడితో ఎప్పుడూ శత్రుత్వం కలిగి ఉండకూడదు. డాక్టర్‌తో శత్రుత్వం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది.. అది భర్తీ చేయడం కష్టం. అంతేకాదు వంటవాడితో శత్రుత్వం జీవితాన్ని ప్రమాదంలో కూడా పడేస్తుంది.
- సన్నిహితులకు మీ జీవితానికి సంబంధించిన రహస్యాలు తెలుసు. కనుక అటువంటి వారితో శత్రుత్వం పెట్టుకోవడం వలన .. మీ రహస్యాలను సమాజంలో అందరికీ తెలిసేలా బట్టబయలు చేయవచ్చు. అప్పుడు మీ స్వంత ఇమేజ్‌కి హాని కలిగిస్తుంది. కనుక మీకు నచ్చినా నచ్చక పోయినా సన్నిహితులతో శత్రుత్వం వచ్చు.
- ధనవంతుడు, శక్తివంతమైన వ్యక్తి నుండి దూరం ఉండడం తెలివైన పని. అలాంటి వారి దగ్గరికి వెళితే, వారు మిమ్మల్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. అంతేకాదు మీరు వారికి ఉపయోగం లేని రోజున.. మీకు హాని చేయడానికి వెనుకాడరు.
- మూర్ఖుడికి కూడా ఎదుటివారిపై నమ్మకం ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఏం చెబుతాడో తెలియదు. కనుక అలాంటి వారికి దూరంగా ఉండండి. మూర్ఖుడికి మీ గురించి పర్సనల్ విషయాలను ఎప్పుడూ చెప్పకండి..
Also Read: