Chanakya Niti: ప్రజలు సంతోషంగా ఉండడానికి దేశాన్ని ఏలే పాలకులు ఏ విధంగా పరిపాలన చేయాలో చెప్పిన చాణక్య

Chanakya Niti: చాణక్యుడు మొదటి మౌర్య చక్రవర్తి  చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి, తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షులు. చాణుక్యుడిని..

Chanakya Niti: ప్రజలు సంతోషంగా ఉండడానికి దేశాన్ని ఏలే పాలకులు ఏ విధంగా పరిపాలన చేయాలో చెప్పిన చాణక్య
Chanakya Niti

Updated on: Aug 20, 2021 | 6:45 AM

Chanakya Niti: చాణక్యుడు మొదటి మౌర్య చక్రవర్తి  చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి, తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షులు. చాణుక్యుడిని కౌటిల్యుడు, విష్ణుగుప్తుడనే పేర్లతో కూడా పిలుస్తారు.  చాణక్యుడు అర్దశాస్త్రాన్ని రచించారు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రంలో కూడా మంచి నిపుణులు. చాణుక్యుడు సమాజంలో జరిగే మంచి చెడులను వివరిస్తూ.. దానికి పాలకులు, ప్రజలు తీసుకోవాలిన జాగ్రత్తలను తెలుపుతూ.. నవ సమాజం నిర్మాణం కోసం చేయాల్సిన పనులను తెలిపారు. ఈరోజు దేశాన్ని ఏలే పాలకులు ఏ విధంగా పరిపాలన చేయాలి..  ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలను అందించాలని చాణక్యుడు సూచించారు.

* ప్రజల సుఖమే పాలకులకు సుఖము. ప్రజల హితమే పాలకులకు మంచి.
*పెరుగుతున్న జనాభాని దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రదేశములలో గృహములను నిర్మించాలి. ఆ గ్రామములలో తటాకములు నిర్మించాలి. దీనివలన నీటి కొరత ఉండదు . రెండవ పంటకు కూడా ఈ తటాకాలు ఉపయోగపడతాయి.
* ఆనకట్టల నిర్మాణం జరపాలి. నీటిని వృధా కానీయరాదు. ప్రతి చుక్కా విలువైనదే.
*వ్యవసాయానికి నీటి సౌకర్యం కల్పించాలి. కాలువలు, చేరువుల ద్వారా వ్యవసాయానికి అనూకూల పరిస్థితులు కల్పించాలి.
* పచ్చిక బయళ్ళు ఏర్పాటు చేయలి. దీనివలన పశువులకు గ్రాసం లభించి పాడి అభివృద్ధి చెందుతుంది.
*వ్యాపర మార్గాలు ఏర్పాటు జరపాలి. వాణిజ్య సౌకర్యాలు మెరుగుపడటం వలన దేశ ఆదాయం పెరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడే అవకాశం ఉండదు.
* విదేశీ వ్యవహారాలలోనూ, దేశ రక్షణలోనూ అప్రమత్తత కలిగిఉండాలి. లేదంటే ఇతరులు చొరబాట్లకు అవకాశం కల్పించినట్లు అవుతుంది.
* దేశక్షేమం కోరే పాలకులు క్లిష్ట పరిస్థితులలో శత్రువులతో కూడా స్నేహం చేయవలసిన పరిస్థితి ఉంటుంది.
* దేశానికి ఆదాయాన్ని ఇచ్చేదే అయినా ప్రజలకు నష్టం కలిగించే వాటిని వదిలేయాలి.
* ప్రకృతి ప్రళయాలు వచ్చినప్పుడు పాలకుడు అనుక్షణం ప్రజల యోగక్షేమాలు విచారించి తగిన రక్షణ కల్పించాలి.

Also Read:  సమాజ్‌వాదీ నేతపై దేశద్రోహం కేసు పెడితే… ఆ పార్టీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడిన ఒవైసీ