Chanakya Neeti: ఆచార్య చాణక్యుడు ఓ సుప్రసిద్ధ భారతీయ ఆర్థికవేత్త, తత్వవేత్త, రాజ సలహాదారు. భారతదేశంలో చాణక్యునికి, ఆయన చెప్పిన చాణక్య నీతి సూత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అనేక విషయాలలో మేధావి అయిన చాణక్యుడు జీవితాన్ని సరైన మార్గంలో తీసుకురావాలంటే ఏం చేయాలో కూడా వివరించాడు. ముఖ్యంగా కొన్ని రకాల అలవాట్లు లేదా నియమాలను అనుసరిస్తే ఉన్నపాటుగా ధనవంతులుగా మారవచ్చని కూడా చెప్పాడు. ఇంకా వాటి ద్వారా ఎవరైనా లాభదాయకంగా, అదృష్టవంతులుగా ఉండగలరని పేర్కొన్నాడు. మరి చాణక్యుడి ప్రకారం ధనార్జన కోసం ఏయే నియమాలను పాటించాలో ఇప్పుడు చూద్దాం..
నైతిక ప్రవర్తన: ఎల్లప్పుడూ నిజాయితీ, నైతిక ప్రవర్తనను కలిగి ఉన్నవారు ఉన్నత స్థాయికి చేరుకోగలరు. డబ్బు విషయంలో పారదర్శకంగా ఉండాలి. అనైతిక మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు దీర్ఘకాల శ్రేయస్సు లేదా ఆనందాన్ని తీసుకురాదని చాణక్యుడు నమ్మాడు.
జ్ఞానం, నైపుణ్యాలు: చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు జ్ఞాన సముపార్జన, నైపుణ్యాల అభివృద్ధిని నొక్కి చెప్పాడు. ఒక వ్యక్తి విద్య, నైపుణ్యాలపై దృష్టి సారిస్తే.. అతను ఎప్పటికీ ఆర్థిక సమస్యలను ఎదుర్కోలేడని చాణక్యుడు చెప్పాడు. మీ నైపుణ్యాలను నేర్చుకోవడానికి, మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలని పేర్కన్నాడు.
పట్టుదల, కృషి: మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యం. కృషి, పట్టుదల, క్రమశిక్షణ వల్లే విజయం లభిస్తుందని చాణక్యుడు నమ్మాడు. ప్రయత్నానికి కట్టుబడి ప్రతి పనిని మీ సామర్థ్యం మేరకు పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
సంబంధాలు: బలమైన సత్సంబంధాలను కలిగి ఉండడం వల్ల కూడా మనిషి ఉన్నతస్థాయికి చేరవచ్చని చాణక్యుడు పేర్కొన్నాడు. గౌరవప్రదమైన వ్యక్తులకు సహకరించి, వారి నుంచి సలహాలను సేకరించండని తెలిపాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).