Vastu Tips: ఉగాదినాడు ఈ 6 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి.. ఇక మీకు డబ్బులకు కొరత ఉండదు..

| Edited By: Janardhan Veluru

Mar 21, 2023 | 11:06 AM

తెలుగు నూతన సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్షం నుంచి ప్రారంభం అవుతుంది. ఈసారి చైత్ర శుక్లం మార్చి 22న ప్రారంభం అవుతుంది.

Vastu Tips: ఉగాదినాడు ఈ 6 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి.. ఇక మీకు డబ్బులకు కొరత ఉండదు..
Vastu Tips
Follow us on

తెలుగు నూతన సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్షం నుంచి ప్రారంభం అవుతుంది. ఈసారి చైత్ర శుక్లం మార్చి 22న ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇదే రోజు ఉగాది పండగను జరుపుకోనున్నారు. అంతేకాదు ఈ రోజులను చైత్ర నవరాత్రులు అని కూడా పిలుస్తారు. చైత్ర మాసం శుక్ల పక్షం ప్రతిపద తిథి నాడు బ్రహ్మా విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. హిందువులు కొత్త సంవత్సరం రోజున ఇంట్లో కొన్ని వస్తువులను తీసుకువస్తే, అది చాలా పవిత్రమైనదిగా, శుభప్రదంగా పరిగణిస్తారు. కాబట్టి, హిందూ నూతన సంవత్సరం రోజున ఇంట్లోకి కొన్ని వస్తువులను తీసుకురావడం వల్ల మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే ఉగాది రోజు ఇంటికి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేసి తీసుకురావాలో తెలుసుకుందాం.

తెలుగు సంవత్సరాదిలో ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి

  1. చిన్న కొబ్బరికాయ: ఒక చిన్న కొబ్బరికాయను ఇంటికి తెచ్చి ఆ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో చుట్టి బీరువాలో ఉంచండి. దీని వల్ల ఇంట్లో సుఖశాంతులు నిలవడమే కాకుండా ధనానికి కూడా ఎలాంటి లోటు ఉండదు.
  2.  తులసి మొక్కను తీసుకురండి: హిందూ నూతన సంవత్సరం సందర్భంగా, తులసి మొక్కను ఇంటికి తీసుకురండి. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఇంటి సానుకూలత చెక్కుచెదరకుండా ఉంటుంది. ఉగాది రోజున తులసీకి పూజలు చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందని నమ్ముతుంటారు.
  3. లోహపు తాబేలును తీసుకురండి: ఉగాది పర్వదినాన లోహపు తాబేలును ఇంట్లోకి తీసుకురావడం వల్ల సానుకూల శక్తి ప్రసారమవుతుంది. దుష్ట శక్తులను కూడా నాశనం చేస్తుంది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి కూడా నెలకొంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
  4. ముత్యాల శంఖాన్ని తీసుకురండి: ముత్యాల శంఖం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ధనం ఉంటుంది. శంఖువు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉగాది రోజు ముత్యాల శంఖుని కొనుగోలు చేయండి. ఇంట్లోకి తెచ్చి పూజ చేసిన తర్వాత డబ్బు పెట్టే చోట ఉంచాలి. ఇది పురోగతికి అన్ని మార్గాలను తెరుస్తుంది. డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు.
  5. ఇవి కూడా చదవండి
  6. శ్రీకృష్ణునికి ఇష్టమైన నెమలి ఈకలను తీసుకురండి: ఏ ఇంట్లో నెమలి ఈక ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. హిందూ నూతన సంవత్సరానికి ముందు ఇంట్లోకి మూడు నెమలి ఈకలను తీసుకురండి.
  7. లాఫింగ్ బుద్ధని తీసుకురండి: ఉగాది రోజున ఇంట్లోకి లాఫింగ్ బుద్ధని తీసుకురండి. దీనిని ఈశాన్య దిశలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు.

(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..