Brahmotsavam: సూర్యప్రభ వాహ‌నంపై ఊరేగిన మ‌ల‌య‌ప్ప స్వామిని దర్శిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం

| Edited By: Anil kumar poka

Sep 15, 2022 | 5:52 PM

Srivari Brahmotsavam: కరోనా నిబంధనలను పాటిస్తూ.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏకాంతంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో..

Brahmotsavam: సూర్యప్రభ వాహ‌నంపై ఊరేగిన మ‌ల‌య‌ప్ప స్వామిని దర్శిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం
Surya Prabha Vahana Seva
Follow us on

Srivari Brahmotsavam: కరోనా నిబంధనలను పాటిస్తూ.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏకాంతంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధ‌వారం ఉదయం 9 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు శ్రీ గోవింద‌రాజ‌స్వామి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులకు అభయమిచ్చారు.

సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్యప్రాప్తి

బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

రాత్రి 7 గంటలకు చంద్రప్రభ ‌వాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్పస్వామి 

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డాక్టర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్రశాంతి రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి దంప‌తులు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Also Read: Navaratri 8th Day Naivedyam: రేపు మహిషాసురమర్దని అవతారంలో అమ్మవారు.. నైవేద్యంగా స్వీట్ పొంగల్ .. తయారీ