Black Ants: ఇంట్లో నల్ల చీమలు పుట్ట పెడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా..?

మన పూర్వకాలం నుంచి మన ఇంట్లో చీమలు, ముఖ్యంగా నల్ల చీమల గురించి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. “ఇంట్లో నల్ల చీమలు ఎక్కువైతే అదృష్టం వస్తుంది” అని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే, దీని వెనుక ఉన్న ఆసక్తికర విషయాలు ఏంటో తెలుసుకుందాం..

Black Ants: ఇంట్లో నల్ల చీమలు పుట్ట పెడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా..?
Black Ants

Updated on: May 31, 2025 | 7:29 AM

మన సంప్రదాయ భారతీయ సంస్కృతిలో ప్రకృతి, జంతువులు, పక్షులు సహా ప్రాణులన్నీ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తాయి. వాటిలో చీమల గురించి కూడా మనకు అనేక విశ్వాసాలు ఉన్నాయి. ముఖ్యంగా నల్ల చీమల పుట్ట గురించి కొన్ని ఆసక్తికరమైన విశ్వాసాలు మన జీవితంలో అర్థవంతమైన ప్రభావం కలిగిస్తాయని పండితులు చెబుతుంటారు.

నల్ల చీమలు సాధారణంగా క్రమశిక్షణ, కఠోర శ్రమ, సమిష్ఠి కృషికి ప్రసిద్ధి చెందాయి. ఇంట్లో నల్ల చీమల పుట్ట లేదా వాటి కదలికలను చూసి కొందరు శుభం జరుగుతుందని భావిస్తారు. ఈ విశ్వాసం పూర్వం నుంచి మన పూర్వీకులు చెప్పిన చింతనల మీద ఆధారపడినది. చీమలు సాధారణంగా ఇంట్లో ఉండే తీపి పదార్థాల వైపే ఆకర్షితమవుతాయి. కానీ అవి ఒక ప్రదేశంలో పుట్ట వేసి స్థిరంగా నివాసం ఉంటే, అది ఆ ఇంటికి శ్రేయస్సు కలిగిస్తుందని చాలామందిలో విశ్వాసం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల చీమలు తిరగడం మంచిదే అన్నది పండితుల వెర్షన్. ఇలా జరిగితే సంపదకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. ఆర్థిక పరిపుష్టితో పాటు ఇంట్లో ప్రశాంతత, సౌఖ్యం, సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయని చెబుతున్నారు. బియ్యం బస్తా దగ్గర నల్లటి చీమలు తారసపడితే.. ఐశ్వర్యం ఇంట్లోకి అడుగు పెడుతున్నట్లే అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. బీరువాల పక్కన నల్ల చీమలు పుట్ట పెడితే.. వెండి, బంగారం ఇంటికి రాబోతుందని అర్థమట

నల్ల చీమల చలనం లేదా వాటి సంఖ్య పెరగడం ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని ప్రజలు నమ్ముతారు. ఇంట్లో నల్ల చీమలు పుట్ట పెడితే, అది ధనం లేదా అదృష్టం వస్తుందని కొందరు విశ్వసిస్తారు. అయితే, ఈ విశ్వాసాలు పూర్తిగా శాస్త్రీయ ఆధారాలు కాదు. చీమల అనేక విషయాలకు ఆకర్షితులు అవుతూ ఉంటాయి. అవి నీటి వాసన, తీపి పదార్థాలు, లేదా తేమ పట్ల ఆకర్షితమవుతాయి. నల్ల చీమలు ఇంట్లో ఉండడం అదృష్టం కలిగించవచ్చు అని నమ్మడం వ్యక్తిగతం.