Bhishma Niti: భీష్ముడు అర్జునుడికి పాలన గురించి ఏమిచెప్పాడు? రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే..

మహాభారతంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. అసలు పేరు దేవవ్రతుడు. గంగాదేవికి శంతన మహారాజుకి పుట్టిన గొప్ప యోధుడు, జ్ఞాని. భీష్మ పితామహుడు అసలు పేరు దేవవ్రతుడు. భీష్ముడు జీవితం గురించి మాత్రమే కాదు రాజ్య పాలనకు సంబంధించిన అనేక ఉపదేశాలు నేటికీ విలువైనవి. అలా భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్న సమయంలో పాండవులకు అనేక విషయాలను గురించి చెప్పాడు. పాండవుల మధ్యముడు అర్జునుడికి భీష్ముడు పాలనకు సంబంధించిన జ్ఞానం గురించి చెప్పాడు. అవి ఏమితొ ఈ రోజు తెలుసుకుందాం.

Bhishma Niti: భీష్ముడు అర్జునుడికి పాలన గురించి ఏమిచెప్పాడు? రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే..
Bhishma Niti

Updated on: Jun 26, 2025 | 5:09 PM

మహాభారత యుద్ధం అతిపెద్ద యుద్ధాలలో ఒకటి. ఈ యుద్ధం ద్వాపరయుగంలో దాయాదులైన కౌరవులు , పాండవుల మధ్య జరిగింది. మహాభారత యుద్ధం 18 రోజులు కొనసాగింది. యుద్ధం జరిగిన 10వ రోజున భీష్మ పితామహుడు అర్జునుడి బాణాలకు గాయపడి అంపశయ్య (బాణాల మంచం) పై ఉండి.. ఉత్తరాయణ కాలం కోసం ఎదురుచూస్తున్నాడు. మరణ శయ్యపై ఉన్న భీష్మ పితామహుడు పాండవులకు అనేక విషయాలపై జ్ఞానాన్ని అందించాడు. భీష్మ పితామహుడు 58 రోజుల పాటు మరణ శయ్యపై ఉన్నాడు. ఈ సమయంలో భీష్మ పితామహుడు అర్జునుడికి చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు. అటువంటి పరిస్థితిలో భీష్ముడు అర్జునుడికి పాలన గురించి ఏమి చెప్పాడో తెలుసుకుందాం.

అధికారాన్ని సొంతానికి వినియోగించవద్దు.
భీష్మ పితామహుడు అర్జునుడికి అధికారాన్ని ఎప్పుడూ వ్యక్తిగత ఉపయోగం కోసం ఉపయోగించకూడదని చెప్పాడు. రాజు ప్రతి అడుగులోనూ తనను తాను పరీక్షించుకోవాలి, తన సమాజ శ్రేయస్సును కాపాడుకోవాలి. పాలకుడు తన ప్రజలను సొంత పిల్లల్లా చూసుకోవాలి.

అహంకారంతో ఉండవద్దు
అధికారం పొందిన తర్వాత పాలకుడు ఎప్పుడూ అహంకారంతో ఉండకూడదని.. రాజు ఎప్పుడూ ఆనందాన్ని ఆశించవద్దని .. రాజు ఎల్లప్పుడూ తన విధిని నిర్వర్తించాలని భీష్మ పితామహుడు చెప్పాడు.

ఇవి కూడా చదవండి

తోలుబొమ్మలా ఉండకు.
అంపశయ్య మీద ఉన్న భీష్ముడు అర్జునుడితో.. రాజు లేదా పాలకుడు ఎప్పుడూ ఎవరి చేతుల్లో కీలుబొమ్మగా మారకూడదని.. సొంతంగా అలోచించలేని వ్యక్తీ.. కాలాల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరి ఆదేశాలను పాటించలేడని చెప్పాడు.

ఆశని వదులుకోవద్దు
త్యాగం లేకుండా మనిషి ఏదీ సాధించలేమని భీష్ముడు చెప్పాడు. త్యాగం లేకుండా మనిషి ఏ భయాన్ని అధిగమించలేడు. త్యాగం ద్వారా మనిషి అంతిమ ఆనందాన్ని పొందుతాడు.

అవమానించవద్దు
ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బాధపెట్టే విధంగా ఎవరితోనూ మాట్లాడకూడదని.. ఏ వ్యక్తి అయినా సరే అహంకారంగా ఉండకూడదు, పొరపాటున కూడా ఎవరినీ అవమానించకూడదని భీష్మ పితామహుడు అర్జునుడికి చెప్పాడు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు