Bhishma Niti: పాలకులకు విజయం సొంతం కావాలంటే భీష్మ నీతిలో చెప్పిన సక్సెస్ సూత్రాలు ఇవే..

మహాభారతం పంచమ వేదంగా ప్రసిద్దిగాంచింది. మనిషి ఏ విధంగా మనిషి జీవించకూడదో తెలియజేస్తుంది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడి అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు పాండవులకు రాజ్య పాలన గురించి మాత్రమే కాదు జీవితం గడపడానికి సరైన మార్గాన్ని చెప్పాడు. జీవితానికి సంబంధించిన ప్రతి రంగంలో జ్ఞానాన్ని బోధించాడు. ఈ విధానాలను అవలంబించడం ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చు. విజయం కోసం భీష్ముడు చెప్పిన నీతిని తెలుసుకుందాం.

Bhishma Niti: పాలకులకు విజయం సొంతం కావాలంటే భీష్మ నీతిలో చెప్పిన సక్సెస్ సూత్రాలు ఇవే..
Bhishma Niti

Updated on: May 04, 2025 | 6:26 PM

మహాభారతంలో అతి ముఖ్యమైన వ్యక్తి కురు వృద్ధుడు భీష్మ పితామహుడు. మహాభారతంలో గొప్ప యోధుడు. తండ్రి కోసం పెళ్లి చేసుకోను ఆజన్మ బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేసి భీష్ముడుగా ప్రసిద్ధిగాంచిన గాంగేయుడు.. కురుక్షేత్రంలో అంపశయ్య మీద ఉన్న సమయంలో భీష్ముడు జీవితానికి సంబంధించిన ప్రతి అంశంపై మాట్లాడాడు. మరణశయ్యపై ఉన్న భీష్ముడు.. పాండవుల ద్వారా ప్రతి వ్యక్తికి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించాడు. భీష్ముడి బోధనలు రాజకీయాలు, జీవిత తత్వశాస్త్రం, మతం గురించి చెబుతాయి. భీష్ముడు పాండవులకు దానధర్మాలు, రాజు విధి, మోక్షం, కర్తవ్యం, స్త్రీ విధి గురించి కూడా చెప్పాడు. భీష్ముడి ఈ విధానాలు జీవితాన్ని మార్గనిర్దేశం చేస్తాయి. సరైన మార్గాన్ని అనుసరించాలని మనకు బోధిస్తాయి. భీష్మ నీతిలో చెప్పిన సక్సెస్ సూత్రాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
మహాభారత కథ

  1. అన్యాయాన్ని, అధర్మాన్ని సమర్ధించే ఏ వ్యక్తి అయినా.. ఏదో ఒక సమయంలో అతను దేవుడి ముందు తలవంచాల్సి వస్తుంది. ఒకరు ఎల్లప్పుడూ నిజాన్ని సమర్థించాలి. చివరికి ధర్మమే గెలుస్తుంది.
  2. అధికార శక్తి ఎల్లప్పుడూ సుఖాలను ఇస్తుంది. అధికారంలో ఉన్న వ్యక్తి బాధ్యత మరింత పెరుగుతుంది. అధికారం పొందిన తర్వాత త్యాగ స్ఫూర్తిని కలిగి ఉండాలి.
  3. అధికారంలో ఉన్నప్పుడు పాలకుడు తన ప్రజలను తన సొంత ఇంటి పిల్లల వలె చూసుకోవాలి. అంటే సొంత కూతురు, కొడుకు వలెనే చూసుకోవాలి. తదనుగుణంగా వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.
  4. భీష్మ పితామహుడు ప్రకారం మనిషికి ఎంతటి దారుణమైన పరిస్థితి ఎదురైనా సరే జీవించాలనే కోరిక ఉండాలి. జీవించాలనే కోరికతో జీవితం చివరి వరకు పోరాడాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. తమ గురువు పట్ల గౌరవం, ప్రేమ ఉండాలి. ఇలా చేయడం ద్వారా మనిషి సక్సెస్ ను అందుకునేందుకు బాటలు వేసుకుంటాడు.
  7. మనిషి ఎటువంటి సమయం, సందర్భాల్లోనైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కష్టాలను అధిగమించడం ద్వారా వ్యక్తి సక్సెస్ అందుకుంటాడు.
  8. భీష్మ పితామహుడు తన విధానాలలో మనిషికి మంచి ప్రవర్తన, ఆలోచనలు ఉండాలని చెప్పాడు.
  9. భీష్మ విధానాలలో జీవనోపాధికి సంబంధించిన ప్రతి అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ విధానాలను స్వీకరించడం ద్వారా ప్రజలు తమ జీవితాలకు సరైన దిశానిర్దేశం చేసుకోగలరు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.