
Batel Leaf Plant Vastu Tips
తమలపాకులను ఆచారాలు, వేడుకలలో ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం తమలపాకు మొక్క శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎవరి ఇంట్లో తమలపాకు మొక్క ఉంటుంతో ఆ ఇంట్లో శనీశ్వరుడు అడుగు పెట్టడు అని ఓ నమ్మకం. అంతేకాదు తమలపాకు మొక్క ఉన్న ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉండవని.. ఆ ఇల్లు మంచి శక్తి, శాంతి, సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు. అయితే తమలపాకు మొక్కని పెంచడానికి వాస్తు నియమాలున్నాయి. తమలపాకు మొక్క సానుకూల ప్రభావాలను పెంచడానికి ఉత్తరం లేదా తూర్పు దిశలలో పెంచడం మంచిది. ఈ మొక్క ప్రకాశవంతమైన ఆకుపచ్చని ఆకులు అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడతున్నాయి. సంపద, సమృద్ధికి దేవత అయిన లక్ష్మీ దేవితో తమలపాకులకు సంబంధం ఉంది.
తమలపాకు మొక్క వాస్తు ప్రయోజనాలు
- సంపద , సమృద్ధిని ఆకర్షిస్తుంది: తమలపాకు సంపదలకు అధిదేవత లక్ష్మీ దేవితో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదని.. శ్రేయస్సుతో నిండి ఉంటుందని నమ్మకం.
- సానుకూల శక్తిని ప్రోత్సహిస్తుంది: పచ్చని తమల ఆకులు సానుకూల ప్రకంపనలను ప్రసరింపజేస్తాయని, ప్రతికూల శక్తులను దూరం చేసి, సామరస్య వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయని నమ్ముతారు.
- శాంతి, సామరస్యాన్ని తెస్తుంది: ఈ తమలపాకు మొక్కకు శుభ శక్తులతో ఉన్న సంబంధం వలన ఈ మొక్క ఉన్న ఇంట్లో శాంతి, శ్రేయస్సుకి లోటు ఉండదు.
- శుభానికి చిహ్నం : వాస్తుశాస్త్రం, వివిధ ఆచారాలలో తమలపాకును అదృష్ట చిహ్నంగా పరిగణిస్తారు. ముఖ్యమైన సంఘటనలు, ప్రయాణాలకు అదృష్టాన్ని తీసుకురావడానికి ఉపయోగిస్తారు.
తమలపాకు మొక్క పెంచడానికి ఉత్తమ స్థానం:
- దిశ : మీ ఇల్లు లేదా తోటలో ఉత్తరం లేదా తూర్పు ముఖంగా ఉన్న దిశలలో తమలపాకు మొక్కను ఉంచండి.
- కాంతి : తమలపాకు మొక్కను బాగా ప్రకాశవంతమైన ప్రదేశం.. అధికంగా ఎండ తగలని చోట పెంచాలి.
- సంరక్షణ : మొక్కను బాగా నిర్వహించి, శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచండి, ఎందుకంటే తమలపాకు మొక్క వాడిపోవడం లేదా చనిపోయిన వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.