Best Vastu Tips: భార్యాభర్తలు సంతోషకరమైన జీవితం గడపాలంటే.. బెడ్ రూమ్‌లో ఈ వాస్తు చిట్కాలను పాటించండి..

|

Dec 27, 2021 | 3:12 PM

Best Vastu tips: జీవిత భాగస్వామితో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలు గడపాలని ప్రతి ఒక్క దంపతులు కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు...  అనుమానం, సందేహం, అవగాహన లేమి వంటి వాటితో..

Best Vastu Tips: భార్యాభర్తలు సంతోషకరమైన జీవితం గడపాలంటే.. బెడ్ రూమ్‌లో ఈ వాస్తు చిట్కాలను పాటించండి..
Best Vastu Tips
Follow us on

Best Vastu Tips: జీవిత భాగస్వామితో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలు గడపాలని ప్రతి ఒక్క దంపతులు కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు…  అనుమానం, సందేహం, అవగాహన లేమి వంటి వాటితో భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడతాయి. దీంతో  సంతోషకరమైన వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఎవరైనా సరే తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటారు. అయితే సందేహాలు, తగాదాలు, అవగాహనా రాహిత్యం సంతోషకరమైన వైవాహిక జీవితంలో వివాదాలు ఏర్పడేలా చేస్తాయి.

ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం దక్కడం లేదు.. పైగా రోజురోజుకూ విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి. అప్పుడు కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే.. వైవాహిక జీవితాన్ని మళ్లీ సంతోషంగా ఉండేలా చేసుకోగలరు. ఈ వాస్తు చిట్కాలు వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడమే కాదు భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమను కూడా పెంచుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఏఏ వాస్తు చిట్కాలను పాటించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బెడ్ రూమ్ కిటికీ

తప్పని సరిగా బెడ్ రూమ్ లో కిటికీ ఉండాలి. ఎందుకంటే ఇది భార్యాభర్తల మధ్య ఉద్రిక్తతను తగ్గిస్తుంది. పరస్పర ప్రేమను పెంపొందించేలా చేస్తుంది.

బెడ్ రూమ్ లో అద్దం: 

పడకగదిలో అద్దం పెట్టుకోవడం వాస్తు ప్రకారం మంచిది. సరైన నిర్ణయంగా పరిగణింపబడుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తగ్గి, వారి మధ్య ప్రేమ పెరుగుతుంది.

ఎలక్ట్రానిక్స్  వస్తువులు: 

పడకగదిలో ఎలక్ట్రానిక్ వస్తువులను పెట్టుకోకూడదు. ఎందుకంటే వాస్తు ప్రకారం సానుకూల శక్తిని తగ్గిస్తుంది.  ఈ వస్తువులు భార్యాభర్తల సంబంధం పై ప్రభావం చూపిస్తుంది.

ముళ్ళు ఉన్న మొక్కలు: 

ఎప్పుడూ బెడ్ రూమ్ లో ఎండిపోయిన లేదా ముళ్ళుగల మొక్కను పెట్టుకోవద్దు.  భార్యాభర్తల మధ్య టెన్షన్ పెరుగుతుంది.

నిద్రపోయే విధానం: 

భార్య ఎల్లప్పుడూ తన భర్తకు ఎడమ వైపున పడుకోవాలి.  భర్త పెద్ద దిండును ఉపయోగించాలి. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుంది.

బెడ్ రూమ్ రంగుల ఎంపిక: 

భార్యాభర్తలు పడుకునే గది రంగు లేత గులాబీ లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉండాలి. ముదురు రంగులను ఎప్పుడూ ఉపయోగించవద్దు. లేత గులాబీ లేదా లేత ఆకుపచ్చ రంగులు ఆహ్లాదకరంగా పరిగణించబడతాయి. ఈ రంగులు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో పాటు భాగస్వామిని దగ్గర చేయడంలో సహాయపడతాయి.

 దేవతా చిత్రాలు: 

భార్యాభర్తలు పడుకునే గదిలో దేవుళ్లు, దేవతల చిత్రాలను పెట్టవద్దు.  దంపతులు తమ పాదాల వైపు నీరు ప్రవహించే చిత్ర పాటలను పెట్టుకోవాలి. ప్రవహించే నీరు ప్రేమకు చిహ్నం.

మనీ ప్లాంట్ : 

వాస్తు ప్రకారం.. బెడ్ రూమ్ లో మనీ ప్లాంట్‌ను ఉంచడం శుక్రుని చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది భార్యాభర్తల మధ్య బంధాన్ని మధురంగా ​​మారుస్తుంది. అంతేకాదు భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది.

Also Read:  జీవితంలో విజయం సాధించాలంటే.. చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను గుర్తుంచుకోండి..