
హిందూ ధర్మంలో రుద్రాక్షను చాలా పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే రుద్రాక్ష శివుని కన్నీటి నుంచి ఉద్భవించిందని చెబుతారు. అందుకే చాలా మంది రుద్రాక్షలను ధరిస్తారు. దీనిని ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అంతేగాక, గ్రంథాల ప్రకారం రుద్రాక్ష పూసతో జపించడం చాలా ఫలవంతమైనదిగా పరిగణిస్తారు. హిందూ శాస్త్రాల ప్రకారం రుద్రాక్ష పూసలతో జపించడం వల్ల అనేక రెట్లు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పూసతో జపించడం ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది.
రుద్రాక్షను ధరించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అయితే, రుద్రాక్షను ధరించడానికి శాస్త్రాలు కొన్ని నియమాలను నిర్దేశించాయి. దీనిని శాస్త్రాలలో సూచించిన నియమాల ప్రకారం ధరించాలి. లేకపోతే ప్రయోజనానికి బదులుగా అది ప్రతికూలతలు కలగవచ్చు.
రుద్రాక్ష ధరించడానికి నియమాలు
శుభప్రదమైన రోజునే రుద్రాక్ష ధరించండి. రుద్రాక్ష ధరించడానికి అత్యంత శుభప్రదమైన రోజులు అమావాస్య, పౌర్ణమి, సోమవారం లేదా శివరాత్రి అని గ్రంథాలు చెబుతున్నాయి. ఇక, రుద్రాక్షను ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. మీరు ధరించిన రుద్రాక్షను మరెవరికీ ఇవ్వద్దు. ఇతరుల రుద్రక్షను తీసుకోవద్దు. మీరు ఈ నియమాలను విస్మరిస్తే.. రుద్రాక్ష ధరించడం వల్ల ప్రయోజనాలకు బదులుగా మీరు అశుభ ఫలితాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
రుద్రాక్షను ధరించడం వల్ల ఆ మహా శివుని ఆశీస్సులు మీపై ఉంటాయి. ఇది మనస్సును కూడా ప్రశాంతంగా మారుస్తుంది. రుద్రాక్ష వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అంతేగాక, ప్రతికూల శక్తి, చెడు దృష్టిని దూరం చేస్తుంది. అపవిత్రమైన, చెడు ఆలోచనలకు దూరంగా ఉంచుతుంది. జ్యోతిష్య శాస్త్రంప్రకారం ఇది గ్రహాల ప్రతికూల ప్రభావాల నుంచి రక్షిస్తుంది. రుద్రక్షాణం ధరించడం వల్ల ప్రతి ప్రయత్నంలోనూ విజయాన్ని చూస్తారు.
Note: ఈ వార్తలోని సమాచారం మతపరమైన అంశాలపై ఆధారపడి ఉంది. TV9 తెలుగు ధృవీకరించదు.