
సంకటహర చతుర్థి అనేది హిందూ మతంలో గణేశుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ. ఇది ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిథి రోజున జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడిని పూజిస్తారు. ఉపవాసం చేస్తారు. గణపతి ఆశీర్వాదం పొందడానికి నియమనిష్టలతో పూజించాలి. గణేశుడిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. అంటే అడ్డంకులను తొలగించేవాడని అర్ధం.సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయని, కుటుంబంలో ఆనందం నెలకొంటుందని నమ్ముతారు. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి సంకటహర చతుర్థి రోజున ఉపవాసం కూడా పాటిస్తారు.
పంచాంగం ప్రకారం పాల్గుణ మాసం కృష్ణ పక్ష చతుర్థి తిధి మార్చి 17, సోమవారం సాయంత్రం 07:33 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మార్చి 18 మంగళవారం రాత్రి 10:09 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున, చంద్రోదయ సమయంలో పూజ నిర్వహిస్తారు. అటువంటి పరిస్థితిలో బాల చంద్ర సంకటహర చతుర్థి మార్చి 17న మాత్రమే జరుపుకోవాల్సి ఉంటుంది.
సంకటహర చతుర్థి రోజున దానం చేయడం ద్వారా గణేశుడు సంతోషించి భక్తులను ఆశీర్వదిస్తాడని నమ్మకం. దానం చేయడం వల్ల ఇతరులకు సహాయం చేయడమే కాదు దాతకు మానసిక ప్రశాంతత, సంతృప్తి లభిస్తుంది. దీనితో పాటు జీవితంలో వచ్చే అడ్డంకుల నుంచి విముక్తి లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు