ఆయోధ్య తర్వాత బద్రీనాథ్ ఆలయంలో కానుకల గోల.. విరాళాల దుర్వినియోగంపై విచారణ షురూ!

అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, మరో పవిత్ర పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయంలోనూ కానుకలు, విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది.

ఆయోధ్య తర్వాత బద్రీనాథ్ ఆలయంలో కానుకల గోల.. విరాళాల దుర్వినియోగంపై విచారణ షురూ!
Badrinath Temple

Updated on: Jul 04, 2026 | 10:16 AM

అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, మరో పవిత్ర పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయంలోనూ కానుకలు, విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది.

బీకేటీసీ చైర్మన్ హేమంత్ ద్వివేది మాట్లాడుతూ, ఆరోపణలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల నుంచి వివరణలు కోరినట్లు పేర్కొన్నారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఒక ఉద్యోగి తన వ్యక్తిగత కార్యదర్శి అన్న ప్రచారాన్ని హేమంత్ ద్వివేది ఖండించారు. ఆ వ్యక్తి తన వ్యక్తిగత సిబ్బందికి చెందినవాడు కాదని, బీకేటీసీలో పనిచేస్తున్న సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమేనని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై జూలై 2న ఫిర్యాదు అందినట్లు కమిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సోహన్ సింగ్ రంగడ్ తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినట్లు చెప్పారు. ఫుటేజీలో స్పష్టమైన ఆధారాలు కనిపించకపోయినా, అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. సీసీటీవీ దృశ్యాలు, అందుబాటులో ఉన్న ఆధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగా నివేదిక సమర్పించేందుకు అంతర్గత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

విచారణలో ఆర్థిక అవకతవకలు లేదా కానుకల దుర్వినియోగం జరిగినట్లు తేలితే, శ్రీ బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చట్టం – 1939తో పాటు ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. విచారణ పూర్తయ్యే వరకు ధృవీకరించని సమాచారం లేదా తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని నమ్మవద్దని, సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భక్తులకు కమిటీ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us