రామ జన్మ భూమి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోట్ల హిందువుల కల తీరే సమయం వచ్చేస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని సరయు నది తీరం ఒడ్డున కొలువైన రామ మందిర నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి. కొత్త సంవత్సరంలో రామయ్య తన గర్భాలయంలో కొలువుదీరనున్నారు. 2023 జనవరి 22వ తేదీన గర్భ గుడిలో రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ వెల్లడించారు.
రాములోరి విగ్రవిష్కరణ కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ సహా సాధువులకు ప్రముఖులకు ఆహ్వానాలను ఇప్పటికే అందజేశారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం 4 వేల మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు హాజరుకానున్నారు.
500 वर्षों के संघर्ष की परिणति pic.twitter.com/z5OTXivUFL
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) October 26, 2023
తాజాగా రామ మందిర నిర్మాణం పనుల తీరుని, మందిర కళావైభవాన్ని తెలియజేసే విధంగా రామ మందిర నిర్మాణ వీడియోను ట్రస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకి 500 ఏళ్ల పోరాటానికి ముగింపు అని కామెంట్ కూడా జతచేశారు. ఈ వీడియోలో రామ మందిర రూపు రేఖలను తెలుపుతోంది. శిల్ప కారులు శిల్పాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు.. వీడియోలో ఆలయంలోని ద్వారాలు, గోపురం, తలపులు. గోడల మీద చెక్కిన శిల్పాలు, పిల్లర్లు, ప్లోరింగ్ వంటి ఆలయ నిర్మాణాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు నిర్మాణం కోసం ఉపయోగించిన భారీ యంత్రాలు కళాకారులను కష్టం.. అన్ని కనిపించేలా ఉంది ఈ వీడియో. అయోధ్య పిలుస్తోంది అన్న బ్యాగ్రౌండ్ అన్న మ్యూజిక్ తో ఆలయ నిర్మాణం దేవత మూర్తుల శిల్పాలతో వీడియో మనసుకు హత్తుకునే లా ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..