Ayodhya: రాములోరి భక్తులకు శుభవార్త..! అందుబాటులోకి అయోధ్య రామ దర్శన మార్గం..

|

Jul 31, 2023 | 12:05 PM

రామాలయ నిర్మాణంలో భాగంగా ఈ ఏడాది అక్టోబరు నాటికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి అవుతుందని అధికారులు వెల్లడించారు.. నాలుగు అంతస్తుల ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్‌ను పూర్తిగా రామ కథ కోసం ప్రత్యేకించి కేటాయించనున్నట్టుగా వెల్లడించారు. ఇక ఆలయానికి ఉన్న మూడు ద్వారాలు, గోపురానికి బంగారు పూత ఏర్పాటు చేయనున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మొత్తం ఐదు మండపాలు ఉంటాయి. 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పుతో నిర్మాణం జరుగుతుంది.

Ayodhya: రాములోరి భక్తులకు శుభవార్త..! అందుబాటులోకి అయోధ్య రామ దర్శన మార్గం..
Ayodhya Ram Path
Follow us on

Ayodhya: కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మూహూర్తం ఇప్పటికే వెలువడింది. ఈ మేరకు 2024 జనవరి 14 తేదీన మకర సంక్రాంతి రోజున ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం ప్రవేశం కోసం నిర్మించిన కొత్త ‘రామపథ’ రహదారిని ఆదివారం భక్తుల కోసం తెరిచారు. రామమందిర నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకుగాను ఇప్పటి వరకు వాడుతున్న రోడ్డును ఆదివారం నుంచి మూసివేసి కొత్తగా నిర్మించిన రాంపాత్‌ రోడ్డును ప్రారంభించారు. ఇక దీంతో రాంలల్లా విగ్రహాన్ని చూడాలంటే ఈ దారిలోనే వెళ్లాలి.

ఇక, ఈ మార్గాన్ని 100 మీటర్ల వెడల్పు, 800 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ రాంపత్ అందమైన ఎర్ర రాళ్లతో నిర్మించబడింది. దీనికోసం సుమారు రూ.40 కోట్లు వెచ్చించారు. ఇంత భారీ ఖర్చుతో ఈ రహదారిని నిర్మించి, రహదారి పొడవునా భక్తులకు తాగునీరు, విశ్రాంతి స్థలం, వైద్యం వంటి ఏర్పాట్లు చేశారు. వచ్చే ఏడాది పరివర్తన సమయంలో, రాంలాల్లా ప్రతిష్టించబడతారు. ఆ తర్వాత భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు.

రామాలయ నిర్మాణంలో భాగంగా ఈ ఏడాది అక్టోబరు నాటికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి అవుతుందని అధికారులు వెల్లడించారు.. నాలుగు అంతస్తుల ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్‌ను పూర్తిగా రామ కథ కోసం ప్రత్యేకించి కేటాయించనున్నట్టుగా వెల్లడించారు. ఇక ఆలయానికి ఉన్న మూడు ద్వారాలు, గోపురానికి బంగారు పూత ఏర్పాటు చేయనున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మొత్తం ఐదు మండపాలు ఉంటాయి. 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పుతో నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయ నిర్మాణం కనీసం వెయ్యి సంవత్సరాల పాటు నిలుస్తుందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..